Home » News » Kavitha Meets Kcr
News

kavitha KCR : కేసీఆర్ ను కవిత కలవడం వెనుక రహస్యం ఏమైనా ఉందా..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 11, 2025 12:47 pm
Advertisement

kavitha KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై విచారణకు హాజరయ్యే ముందు కవిత తన భర్త అనిల్‌తో కలిసి ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఇప్పటికే ఈ విచారణ నేపథ్యంలో కవిత తన తండ్రికి మద్దతుగా ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను ప్రత్యక్షంగా కలవడం, తండ్రి పరిణామాలపై చర్చించేందుకు ప్రయత్నించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

kavitha KCR : కేసీఆర్ ను కవిత కలవడం వెనుక రహస్యం ఏమైనా ఉందా..?

kavitha KCR : లేఖ వివాదం తర్వాత కేసీఆర్ ఫస్ట్ టైం కలిసిన కవిత

కవిత ఇటీవల రాసిన లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తన అన్న కేటీఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేయడం, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను తండ్రి వద్ద ఉన్నారని వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ లో తీవ్ర సంక్షోభాన్ని కలిగించాయి. బీజేపీలో విలీనం అవుతారన్న ప్రచారాల మధ్య కవిత చేసిన ఆరోపణలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. అయితే, హరీష్ రావు స్పష్టత ఇవ్వడంతో, పార్టీ బీజేపీలో విలీనం కానుందన్న వార్తలకు బ్రేక్ పడింది. దీంతో కవిత స్వరాన్ని తగ్గించి, తండ్రిని కలుస్తానని ప్రకటించారు. ఇక ఈరోజు ఆమె కలువడం జరిగింది.

Advertisement

ఇటు కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణకు కేసీఆర్‌తో పాటు కవిత కూడా బీఆర్కే భవన్‌కి వెళ్లనున్నట్లు సమాచారం. విచారణ సమయంలో తండ్రికి మద్దతుగా ఉండాలని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ పార్టీ ఆఫీసులో నుంచే పరిస్థితిని సమీక్షిస్తున్నారని సమాచారం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి