Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!
Dwcra Women : ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు తెలిపింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల పిల్లల విద్య కోసం నూతన పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరిట ఈ స్కీం తీసుకొస్తున్న ప్రభుత్వం, గ్రామీణ మహిళల పిల్లలకు విద్యార్థి రుణాల రూపంలో ఆర్థిక భరోసా కల్పించనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు కేవలం నాలుగు శాతం వడ్డీ (ప్రతి రూపాయికి 35 పైసలు వడ్డీ)తో రూ.10 వేలు నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేయనుంది.
Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!
ఈ పథకం లక్ష్యం విద్యను కొనసాగించడంలో ఆర్థికంగా వెనుకబడే కుటుంబాలకు తోడ్పాటు అందించడం. విద్యార్థులు 1వ తరగతి నుంచి పీజీ వరకు ఏ స్థాయిలో చదువుతున్నా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివినా, ఈ స్కీం వర్తిస్తుంది. రుణాన్ని పిల్లల యూనిఫార్మ్, పుస్తకాలు, ఫీజులు, సైకిల్ కొనుగోలు వంటి విద్యా సంబంధిత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. ఖర్చులకు సంబంధించిన రశీదులు అధికారులకు సమర్పించాలి. రుణాన్ని కనీసం 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల లోపు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) నోడల్ ఏజెన్సీగా అమలు చేస్తోంది. స్త్రీనిధి కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కొనసాగనుంది. లబ్ధిదారులు ఈ స్కీం ద్వారా పూర్తిగా ప్రయోజనం పొందాలంటే, వారు తప్పనిసరిగా డ్వాక్రా సంఘ సభ్యులుగా ఉండాలి. అవసరమైన సమాచారం కోసం SERP లేదా స్త్రీనిధి అధికారులను సంప్రదించాలి. ఈ పథకం ద్వారా పేదవారి పిల్లలు విద్యలో ముందుకెళ్లే అవకాశం పొందుతారని, వారి భవిష్యత్‌కి ఇది బలమైన మద్దతుగా నిలవనుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.