KCR Birthday : చరిత్రలో అధ్యాయం.. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్
KCR Birthday : ఇక తెలంగాణ Telangana ప్రత్యేక రాష్ట్రం అసాధ్యం అనుకున్న తరుణంలో స్వరాష్ట్ర కాంక్ష రగిల్చి దానిని సుపాధ్యం చేసిన నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్). పదవులను త్యాగం చేసి టీఆర్‌ఎస్‌ను TRS స్థాపించి దాదాపు దశాబ్దంన్నర పోరాటం తర్వాత స్వరాష్ట్ర స్వప్నం సాకారంలో కేసీఆర్ కీలక భూమిక పోషించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాన్నే సోపానంగా చేసుకుని స్వరాష్ర్ట స్వప్నాన్ని సాకారం చేశారు. సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ప్రజల్లో సొంత రాష్ట్రం భావన పెంచి.. స్వరాష్ట్ర సాధనకు సారథ్యం వహించారు. చివరకు ఆమరణ నిరాహార దీక్ష అస్త్రాని సంధించి తెలంగాణ స్వరాష్ట్ర ప్రకటన వచ్చేలా చేశారు.
KCR Birthday : చరిత్రలో అధ్యాయం.. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్
ఇక తెలంగాణ రాష్ట్రం Telangana సిద్ధించాక కేసీఆర్ KCR సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా దశాబ్దకాలం పాలించారు. కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ముందు ఉంచారు. పదేళ్లలో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. వలసలు తగ్గాయి. నీటి వనరులు పెరిగి పంటలు బాగా పండాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టి రైతులకు పంట పెట్టుబడి సాయం అందించారు.
సంపూర్ణ సత్యం ఏదీ ఉండదు.. పరిపూర్ణ మానవుడు ఎవరూ కాదు అన్నట్లుగా కేసీఆర్ KCR అన్నింటిలో పర్‌ఫెక్ట్ కాకపోవచ్చు. ప్రతీ విషయంలో సక్సెస్ ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో దళిత సీఎం, పేదలకు మూడుకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు లాంటి హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. ఉద్యమ నినాదం అయిన నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలను పక్క పెట్టేశారు. ఇక ఆయన చేసిన మరో పెద్ద పొరపాటు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడమే అని అంటుంటారు అంతా. అలాగే సాగు భారమై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోకపోవడం వంటి చర్యతు కూడా కేసీఆర్‌పై వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఏది ఏమైనా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం కేసీఆర్ పేరు నిలిచే ఉంటుంది. KCR, Telangana movement, Telangana
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
Banana | మన మార్కెట్లలో సంవత్సరం పొడవునా దొరికే సులభమైన పండు అరటిపండు (Banana). అందరికీ అందుబాటులో ఉండే ఈ…
Head Ache | ఈ రోజుల్లో పని ఒత్తిడి, నిద్రలేమి, ధ్వనికలహలం, దుస్తులు, డిజిటల్ స్క్రీన్ల వాడకం వంటి అనేక కారణాలతో…
Water | చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు..భోజనం చేస్తూనే లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం. అయితే ఆరోగ్య…
EGG | మార్కెట్లలో గుడ్లు చౌకగా లభించడంతో, చాలా మంది ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే…
Hibiscus Plant Vastu Tips | భారతీయ సంప్రదాయంలో మొక్కలు, పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజల్లో, వాస్తులో, ఆరోగ్య…
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
This website uses cookies.