KCR Birthday : చ‌రిత్ర‌లో అధ్యాయం.. తెలంగాణ ఉద్య‌మ ర‌థ‌సార‌థి కేసీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR Birthday : చ‌రిత్ర‌లో అధ్యాయం.. తెలంగాణ ఉద్య‌మ ర‌థ‌సార‌థి కేసీఆర్

 Authored By ramu | The Telugu News | Updated on :17 February 2025,9:03 pm

ప్రధానాంశాలు:

  •  KCR Birthday : చ‌రిత్ర‌లో అధ్యాయం.. తెలంగాణ ఉద్య‌మ ర‌థ‌సార‌థి కేసీఆర్

KCR Birthday : ఇక తెలంగాణ‌ Telangana ప్రత్యేక రాష్ట్రం అసాధ్యం అనుకున్న తరుణంలో స్వరాష్ట్ర కాంక్ష రగిల్చి దానిని సుపాధ్యం చేసిన నేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్‌). ప‌ద‌వులను త్యాగం చేసి టీఆర్‌ఎస్‌ను TRS  స్థాపించి దాదాపు దశాబ్దంన్న‌ర పోరాటం తర్వాత స్వ‌రాష్ట్ర‌ స్వప్నం సాకారంలో కేసీఆర్ కీల‌క భూమిక పోషించారు. ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయాన్నే సోపానంగా చేసుకుని స్వ‌రాష్ర్ట స్వ‌ప్నాన్ని సాకారం చేశారు. సబ్బండ వర్గాలను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ప్రజల్లో సొంత రాష్ట్రం భావన పెంచి.. స్వరాష్ట్ర సాధనకు సారథ్యం వహించారు. చివ‌ర‌కు ఆమరణ నిరాహార‌ దీక్ష అస్త్రాని సంధించి తెలంగాణ స్వ‌రాష్ట్ర‌ ప్రకటన వచ్చేలా చేశారు.

KCR Birthday చ‌రిత్ర‌లో అధ్యాయం తెలంగాణ ఉద్య‌మ ర‌థ‌సార‌థి కేసీఆర్

KCR Birthday : చ‌రిత్ర‌లో అధ్యాయం.. తెలంగాణ ఉద్య‌మ ర‌థ‌సార‌థి కేసీఆర్

KCR Birthday : అభివృద్ధికి బాటలు..

ఇక తెలంగాణ రాష్ట్రం Telangana సిద్ధించాక కేసీఆర్  KCR సీఎం అయ్యారు. ముఖ్యమంత్రిగా దశాబ్దకాలం పాలించారు. కొత్త రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ముందు ఉంచారు. పదేళ్లలో తెలంగాణ పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. వలసలు తగ్గాయి. నీటి వ‌న‌రులు పెరిగి పంటలు బాగా పండాయి. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుబంధు పథకాన్ని కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టి రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం అందించారు.

KCR Birthday విస్మ‌రించిన హామీలు..

సంపూర్ణ స‌త్యం ఏదీ ఉండ‌దు.. ప‌రిపూర్ణ మాన‌వుడు ఎవ‌రూ కాదు అన్న‌ట్లుగా కేసీఆర్‌ KCR  అన్నింటిలో పర్‌ఫెక్ట్‌ కాకపోవచ్చు. ప్రతీ విషయంలో సక్సెస్‌ ఎవరికీ సాధ్యం కాదు. కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో దళిత సీఎం, పేదలకు మూడుకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు లాంటి హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. ఉద్యమ నినాదం అయిన నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలను పక్క పెట్టేశారు. ఇక ఆయన చేసిన మరో పెద్ద పొర‌పాటు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడమే అని అంటుంటారు అంతా. అలాగే సాగు భార‌మై ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకోక‌పోవ‌డం వంటి చ‌ర్య‌తు కూడా కేసీఆర్‌పై వ్యతిరేకతకు కారణమ‌య్యాయి. ఏది ఏమైనా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం కేసీఆర్‌ పేరు నిలిచే ఉంటుంది. KCR, Telangana movement, Telangana

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది