
KCR : పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు... కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు...!
KCR : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పొందిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తమ పార్టీ ప్రక్షాళన దిశగా కసరత్తులు ప్రారంభించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సొంత జిల్లా అయినటువంటి మెదక్ లో కూడా బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పార్టీ క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహం లో మునిగిపోయి ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీనిలో భాగంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కేటీఆర్ ను బాధ్యతలు నుంచి తప్పించి ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిలో భాగంగానే ఆ స్థానాన్ని కుటుంబంలోని మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు కేటాయించాలఆ అనే విషయంపై కెసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాలలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించేందుకు హరీష్ రావు పేరు ముందు వరసలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఇక్కడ హరీష్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లయితే కుటుంబ సభ్యులకే మరోసారి పదవి ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో హరీష్ రావుతో పాటు ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల తో పాటు మరికొన్ని వర్గాల నుండి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే విధంగా కెసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.
KCR : పార్టీ ప్రక్షాళన దిశగా కేసీఆర్ అడుగులు… కేటీఆర్ స్థానంలో హరీష్ రావుకు కీలక బాధ్యతలు…!
అంతేకాక రానున్నది ఎన్నికల కాలం అవ్వడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగే నాయకుల కోసం గులాబీ బాస్ ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటేే హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను స్వీకరించేందుకు సానుకూలంగా లేరట. ఒకవేళ కెసీఆర్ దిగివచ్చి అప్పగిస్తే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
This website uses cookies.