Telangana Budget 2023-24: కొద్ది నిమిషాల క్రితం తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2023-24 ఏడాదికి సంబంధించి 2,90,395 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ తెలంగాణ బడ్జెట్… దేశానికి ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే రైతు రుణమాఫీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు ₹6385 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు.., రైతుబందు పథకానికి రూ. 1575 కోట్లు, రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు, నీటి పారుదల రంగం రూ. 26,885 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 12,727 కోట్లు, హోంశాఖకు రూ. 9,599 కోట్లు…ఇంకా పలు శాఖలకు సంబందించిన కేటాయింపులు మంత్రి హరీష్ రావు వివరించారు.
సరిగ్గా ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావటంతో దాదాపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగించడం జరిగింది. ఈ క్రమంలో రైతు రుణమాఫీ పథకానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
This website uses cookies.