Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్...!
Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు నెలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. మొదటగా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించాల్సి ఉండగా, ఈ ఆర్డినెన్స్‌ను వారం రోజుల్లోగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఆ వెంటనే పదిరోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్…!
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. మొదటగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల స్థానాల్లో సామాజిక న్యాయాన్ని నిలబెట్టే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు.
ఇక రిజర్వేషన్ల అమలుకు సంబంధించి 2018లో తీసుకున్న చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే చట్ట సవరణ ప్రక్రియ మొదలయ్యిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సమగ్రంగా కులగణనను చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని పొంగులేటి పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి రేపే అవకాశం కనిపిస్తోంది.
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…
TDP : నెల్లూరు జిల్లా Nellore విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…
Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…
Udaya Bhanu : బుల్లితెర అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న యాంకర్ ఉదయభాను Uday Bhanu. ఈ అందాల యాంకర్ ఒకప్పుడు…
Dating : కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే డేటింగ్ సాంప్రదాయం మెల్లగా ఇండియాలోకి కూడా…
Curd With Sugar : సాధారణంగా పెరుగు అంటే చాలా ఇష్టపడతారు. ఈ పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి…
Aadhar Card New Rules : ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలు…
This website uses cookies.