Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్…!
ప్రధానాంశాలు:
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే లోకల్ ఎన్నికలు - పొంగులేటి
ఆ లోపే స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్...!
Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు నెలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. మొదటగా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సవరణ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించాల్సి ఉండగా, ఈ ఆర్డినెన్స్‌ను వారం రోజుల్లోగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఆ వెంటనే పదిరోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Local Elections : తెలంగాణ స్థానిక ఎన్నికలపై కీలక అప్డేట్…!
Local Elections : ఆగస్టు పూర్తియ్యేలోపే స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి – సీఎం రేవంత్
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. మొదటగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల స్థానాల్లో సామాజిక న్యాయాన్ని నిలబెట్టే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు.
ఇక రిజర్వేషన్ల అమలుకు సంబంధించి 2018లో తీసుకున్న చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే చట్ట సవరణ ప్రక్రియ మొదలయ్యిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సమగ్రంగా కులగణనను చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని పొంగులేటి పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి రేపే అవకాశం కనిపిస్తోంది.