KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌లో ఆస్క్ కేటీఆర్ లో పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దామని అనుకున్నానని అన్నారు. ఇక తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నాని స్పష్టం చేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడా మాట్లాడింది లేదు.తిరిగింది లేదు. ఈ ఏడాది డిసెంబర్ నుండి కేసీఆర్ ప్రజలలోకి వస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.. కేటీఆర్ 2025లో తన తండ్రి బయటకు వస్తారని అంటున్నారు. అయితే కేసీఆర్ బయటకు వచ్చేట్లు అయితే కేటీఆర్, హరీష్ రావు ఎందుకు ఇలా గొంతు చించుకొని అరుస్తున్నారు. రాజకీయాలని వదిలేద్దామని అన్న, కేసీఆర్ జనాలలోకి వస్తారని చెబుతున్నా ఎందుకో ఎక్కడ తేడా కొడుతుంది అని అంటున్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని స్పష్టంచేశారు. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని కేటీఆర్ హెచ్చరించారు.. పార్లమెంట్‌కు వెళ్లడం కన్నా తనకు తెలంగాణలో ఉండటమే ఇష్టమని వివరించారు. ఇప్పుడు ఉన్న జీహెచ్ఎంసీ స్వరూపం ఎలా మారుతుందో తెలియదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై ఏం చర్యలు తీసుకుంటారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. వేచి చూడాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ వంటి మహానగరంలో 144 సెక్షన్ విధించడం షాకింగ్‌కు గురి చేసిందన్నారు. మొత్తానికి కేటీఆర్ మాటలు మాత్రం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.
Ind Vs Aus : సొంత గడ్డపై దారుణమైన ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న భారత India జట్టు ఇప్పుడు…
Health Benefits : పారిజాత మొక్క శాస్త్రీయంగా Nyctanthes arbor-tristis అని పిలుస్తారు. ఇది సువాసనగల, రాత్రిపూట పుష్పించే చెట్టు.…
Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
This website uses cookies.