10 Retain players IPL 2025 : ఐపీఎల్ 2025 కి ముందు ఆటగాళ్ల కోసం మెగా వేలం జరగనుంది. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించాయి. అయితే, ఏవరూ ఊహించని విధంగా స్టార్ ప్లేయర్లను కూడా కొన్ని టీమ్స్ వదులుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.
ఐపీఎల్-2025కు సంబంధించి ప్రకటించిన పది ఫ్రాంచైజీల రిటైన్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్‌కు భారీ ధర దక్కింది. ఈ దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్- వికెట్ కీపర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.23 కోట్లు చెల్లించింది.కోహ్లిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.21 కోట్లు ఇచ్చి తమ ఫ్రాంచైజీలో కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కోహ్లి వేలంలోకి వెళ్లని ఆటగాడిగా తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ తమ వికెట్ కీపర్-హిట్టర్ నికోలస్ పూరన్‌కు కూడా రూ.21 కోట్లు రిటైన్ ధర నిర్ణయించింది. ఇక సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్, బ్యాటర్ యశస్వీ జైస్వాల్, గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు.. రూ.18 కోట్లు రిటైన్ ధర దక్కించుకున్నారు.
ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్లల విషయానికి వస్తే అత్యధిక రిటైన్ ధర పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు), ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ (రూ.5 కోట్లు) పొందారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు బీసీసీఐ కనీసం రూ.4 కోట్లుగా రిటైన్ ధర నిర్ణయించింది.అన్ క్యాప్‌డ్ ప్లేయర్ జాబితాలో ఉన్న ధోనీ నాలుగు కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్‌కు కొనసాగనున్నాడు.రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్, కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కొనసాగిస్తున్నాయి. కే ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లను ఆయా జట్లు రిటైన్ చేసుకోలేదు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికే 60 రోజులకి పైగా పూర్తి…
Vangalapudi Anitha : పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చాలా కూల్‌గా కనిపిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజాగా…
Fingers : చాలా మంది చేతి వేళ్లను అప్పుడప్పుడు ఇరుస్తూ ఉంటారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఇలా చేతి వేళ్లను…
Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య…
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
This website uses cookies.