
Liquor Prices : బాబోయ్ ఇంత ఝలక్ ఇచ్చారేంటి.. ఒక్కసారిగా పెరిగిన మధ్యం ధరలు
Liquor Prices : తెలంగాణలో మద్యం ప్రియులకి దిమ్మ తిరిగే న్యూస్ ఒకటి అందింది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది. మార్కెట్ ధరల్లో మార్పుల కారణంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను పెంచుతూ మద్యం దుకాణాలకు సర్క్యులర్లు పంపింది.
ఈ సర్క్యులర్ల ప్రకారం, 180 ml క్వార్టర్ బాటిల్‌పై రూ. 10, 360 ml హాఫ్ బాటిల్‌పై రూ. 20, ఫుల్ బాటిల్‌పై రూ. 40 ధర పెరగనుంది. అయితే, ఈ ధరల పెరుగుదలపై ఎక్సైజ్ శాఖ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది మందుబాబుల జేబులకు మరింత చిల్లు పెట్టే అవకాశముంది. అయితే, గత అనుభవాలను బట్టి చూస్తే ధరలు పెరిగినా అమ్మకాలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చని తెలుస్తోంది.
Liquor Prices : బాబోయ్ ఇంత ఝలక్ ఇచ్చారేంటి.. ఒక్కసారిగా పెరిగిన మధ్యం ధరలు
తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు కొనసాగే అవకాశం ఉంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తుందో వేచి చూడాలి.ఇక తెలంగాణలో ఎండలు మండుతుండటంతో బీర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చల్లని బీర్ తాగడానికి మందుబాబులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే అమ్మకాలు రెట్టింపు అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బేవరేజెస్ కంపెనీల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బీర్ల ధరలను 15 శాతం వరకు పెంచింది.
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
This website uses cookies.