Liquor Prices : బాబోయ్ ఇంత ఝ‌ల‌క్ ఇచ్చారేంటి.. ఒక్క‌సారిగా పెరిగిన మ‌ధ్యం ధ‌ర‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Liquor Prices : బాబోయ్ ఇంత ఝ‌ల‌క్ ఇచ్చారేంటి.. ఒక్క‌సారిగా పెరిగిన మ‌ధ్యం ధ‌ర‌లు

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2025,6:00 pm

Liquor Prices : తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కి దిమ్మ తిరిగే న్యూస్ ఒక‌టి అందింది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమైంది. మార్కెట్ ధరల్లో మార్పుల కారణంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను పెంచుతూ మద్యం దుకాణాలకు సర్క్యులర్లు పంపింది.

Liquor Prices : పెరిగిన ధ‌ర‌లు

ఈ సర్క్యులర్ల ప్రకారం, 180 ml క్వార్టర్ బాటిల్‌పై రూ. 10, 360 ml హాఫ్ బాటిల్‌పై రూ. 20, ఫుల్ బాటిల్‌పై రూ. 40 ధర పెరగనుంది. అయితే, ఈ ధరల పెరుగుదలపై ఎక్సైజ్ శాఖ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది మందుబాబుల జేబులకు మరింత చిల్లు పెట్టే అవకాశముంది. అయితే, గత అనుభవాలను బట్టి చూస్తే ధరలు పెరిగినా అమ్మకాలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చని తెలుస్తోంది.

Liquor Prices బాబోయ్ ఇంత ఝ‌ల‌క్ ఇచ్చారేంటి ఒక్క‌సారిగా పెరిగిన మ‌ధ్యం ధ‌ర‌లు

Liquor Prices : బాబోయ్ ఇంత ఝ‌ల‌క్ ఇచ్చారేంటి.. ఒక్క‌సారిగా పెరిగిన మ‌ధ్యం ధ‌ర‌లు

తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు కొనసాగే అవకాశం ఉంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తుందో వేచి చూడాలి.ఇక తెలంగాణలో ఎండలు మండుతుండటంతో బీర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చల్లని బీర్ తాగడానికి మందుబాబులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే అమ్మకాలు రెట్టింపు అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బేవరేజెస్ కంపెనీల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బీర్ల ధరలను 15 శాతం వరకు పెంచింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది