Home » Exclusive » Man Kills Wife Daughter And Mother Then Committed Suicide In Habsiguda
Exclusive

Crime News : నాలుగేళ్ల చిన్నారికి ఉరి వేసి చంపేసిన కన్న తండ్రి.. ఆ తర్వాత భార్యను ఏం చేశాడంటే?

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 17, 2023 8:07 am
Advertisement

Crime News : సొంత కూతురును అది కూడా నాలుగేళ్ల చిన్నారిని ఉరి వేసి చంపేశాడు కన్న తండ్రి. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. హైదరాబాద్ నడిబొడ్డున హబ్సిగూడలో చోటు చేసుకుంది. సంక్రాంతి పూట ఈ ఘటన స్థానికంగా కలకలం లేపింది. అయితే.. నాలుగేళ్ల చిన్నారిని చంపేసిన ఆ కసాయి తండ్రి ఆ తర్వాత భార్యను కూడా చంపేశాడు. ఆ తర్వాత మరో మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Advertisement

నగరంలోని హబ్సిగూడలో ఉండే ఓ అపార్ట్ మెంట్ లో 34 ఏళ్ల ప్రతాప్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు 32 ఏళ్ల సింధూర అనే భార్య ఉంది. ఆ దంపతులకు నాలుగేళ్ల చిన్నారి ఆద్య ఉంది. వీళ్లతో పాటే ప్రతాప్ తల్లి కూడా ఉంటుంది. అయితే.. ప్రతాప్ చెన్నైలో ఓ కారు షోరూమ్ లో డిజైన్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సింధూర మాత్రం హిమాయత్ నగర్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పని చేస్తోంది.

Advertisement

Crime News : ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేయాలనే విషయంపై గొడవ

అయితే.. ఇద్దరి మధ్య చాలా కాలంగా గొడవ జరుగుతోంది. ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేయడానికి ప్రతాప్ ప్రయత్నిస్తుండగా.. సింధూర మాత్రం హైదరాబాద్ లోనే ఉండాలంటూ గొడవ పెట్టుకుంది. దీంతో ఇద్దరి మధ్య ఇదే విషయంపై ప్రతి రోజూ గొడవ. ఈనేపథ్యంలో సంక్రాంతి నాడు ఆదివారం కూడా ఇద్దరి మధ్య ఇదే గొడవ జరిగింది. దీంతో కోపంతో ప్రతాప్.. ముందు సింధూరను చంపేశాడు. ఆ తర్వాత తన కూతురు ఆద్యకు ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా చంపేసి.. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించాడు. ఆ తర్వాత ప్రతాప్ కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సింధూర కోసం వచ్చిన బ్యాంకు సిబ్బంది.. డోర్ కొట్టగా ఎంతకీ తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు డోర్ బద్దలు కొట్టగానే.. నలుగురు వ్యక్తులు ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి