Home » News » Motakondur New Assembly Constituency Demand
News

Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !

Motakondur Assembly Constituency: తెలంగాణలో భవిష్యత్తులో చేపట్టనున్న శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరును…
Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: November 21, 2026, 11:40 am
Advertisement

Motakondur Assembly Constituency: తెలంగాణలో భవిష్యత్తులో చేపట్టనున్న శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరును ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ వ్యక్తమైంది. ఈ మేరకు జాతీయవాది పీసరి తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో మోటకొండూరు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Motakondur : మోటకొండూరును అసెంబ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం !

కొత్త అసెంబ్లీ నియోజకవర్గంగా మోటకొండూరును ఏర్పాటు చేయాలని డిమాండ్

మోటకొండూరు మండల కేంద్రం చుట్టుపక్కల ఉన్న అనేక మండలాలు, గ్రామాలకు ప్రధాన కేంద్రబిందువుగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, రవాణా సౌకర్యాలు, వేగంగా జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే మోటకొండూరును కొత్త శాసనసభ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు.

Advertisement

పీసరి తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం

Also Read :  Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!

రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో మోటకొండూరుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయవాది పీసరి తిరుమల రెడ్డి కోరారు. స్థానిక ప్రాంతాల భౌగోళిక అనుకూలత, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయవాదులు చిర్ర రవీందర్, తండా కృష్ణ గౌడ్, అనంతుల పాండురంగారెడ్డి, ఆలేటి నాగరాజు, బాల్ద నర్సింహులు, మల్గ అశోక్, రేగు మల్లేష్, భూమండ్ల మురళి, శనిగారం ప్రదీప్, జివిలికపల్లి శ్రీను, బొబ్బల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ramalingaiah Tandu

Author Bio Info : Author Bio Info : Ramalingaiah Tandu is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి