
question to kcr that there are no jobs unemployed
KCR : తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత తానే ముఖ్యమంత్రి అయిన కానీ, ఇప్పటివరకు తెలంగాణలో కొత్త ఉద్యోగాల నియామకాలు ఏమి జరగలేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా మహబూబాబాబ్ జిల్లాలోని గూడురు మండలం గుండెంగా గ్రామానికి చెందిన బోడ సునీల్ చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. 2016వ సంవత్సరంలో ఎస్సై పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యాడు. కానిస్టేబుల్ పరీక్షలు కూడా రాసి క్వాలిఫై అయ్యాడు. కానీ తగినంత ఎత్తు లేడన్న కారణంతో అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు.
అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు దాటినా నిరుద్యోగుల కోసం సర్కారు పనిచేసిన దాఖలాలు లేవని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
“తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతోంది. రాజకీయ నాయకులు మాటలతో కాలం గడిపేస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచడం, వారి పదవీ విరమణ కాలాన్ని కూడా పెంచడం వంటివి చేస్తున్నారు కానీ, నిరుద్యోగుల గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.. ‘ నేనేం చేతకాక చనిపోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వానికి నా డిమాండ్, నిరుద్యోగుల సమస్యలు తెలియాలన్న కారణంతోనే నేను ఆత్మహత్యాయత్నం చేస్తున్నా. కేసీఆర్ సర్కారుపై పోరాడాలి. ఫ్రెండ్స్.. నేను బతికొస్తే నిరుద్యోగుల కోసం మీతో కలిసి ఉద్యమం చేస్తా. నేను తిరిగి రాకుంటే, ఆసుపత్రిలోనే చనిపోతే నా తరపున నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించండి‘ అంటూ బోడ సునీల్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.