Rahul Gandhi : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అయితే ఈరోజు శనివారం హైదరాబాద్ శివారులో తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఈ మేనిఫెస్టోలో సామాజిక , ఆర్థిక , అభివృద్ధి అంశాలతో కూడిన 25 గ్యారంటీలను పొందు పరిచారు.
ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ. మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పనిచేశారో మనందరికీ తెలుసు. కేసీఆర్ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులతో పాటు అమాయకుల ఫోన్లను కూడా టాపింగ్ చేయించారు. రెవెన్యూ మరియు ఇంటిలిజెన్స్ వ్యవస్థలను సైతం ఆయన దుర్వినియోగం చేశారు. ఫోన్ టాపింగ్ కు సంబంధించి ఆధారాలు దొరక్కుండా వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లి నదుల్లో పడేశారు. బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు కేసీఆర్ పాల్పడ్డారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.
అలాగే ఇక్కడ కెసిఆర్ చేసినట్లే కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్నారని , మోడీ వచ్చారంటే ముందు ఈడి వస్తుందంటూ తెలిపారు. భారతదేశంలో బీజేపీ పార్టీ అనేది పెద్ద వాషింగ్ మిషన్ లాగా మారిందని దీంతో దేశంలో ఉన్న అవినీతిపరులు అందరూ మోడీ కిందకు చేరారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా మోడీ మనుషులు ఉన్నారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ప్రపంచంలో ఎక్కడ జరగని అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.