Rahul Gandhi : తుక్కుగూడ‌లో కాంగ్రెస్ మ్యానీఫెస్టో విడుద‌ల‌… కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rahul Gandhi : తుక్కుగూడ‌లో కాంగ్రెస్ మ్యానీఫెస్టో విడుద‌ల‌… కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2024,8:53 pm

ప్రధానాంశాలు:

  •  Rahul Gandhi : తుక్కుగూడ‌లో కాంగ్రెస్ మ్యానీఫెస్టో విడుద‌ల‌... కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Rahul Gandhi : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అయితే ఈరోజు శనివారం హైదరాబాద్ శివారులో తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఈ మేనిఫెస్టోలో సామాజిక , ఆర్థిక , అభివృద్ధి అంశాలతో కూడిన 25 గ్యారంటీలను పొందు పరిచారు.

Rahul Gandhi తెలంగాణలో కేసీఆర్… కేంద్రంలో మోడీ….

ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ. మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పనిచేశారో మనందరికీ తెలుసు. కేసీఆర్ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులతో పాటు అమాయకుల ఫోన్లను కూడా టాపింగ్ చేయించారు. రెవెన్యూ మరియు ఇంటిలిజెన్స్ వ్యవస్థలను సైతం ఆయన దుర్వినియోగం చేశారు. ఫోన్ టాపింగ్ కు సంబంధించి ఆధారాలు దొరక్కుండా వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లి నదుల్లో పడేశారు. బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు కేసీఆర్ పాల్పడ్డారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.

Rahul Gandhi తుక్కుగూడ‌లో కాంగ్రెస్ మ్యానీఫెస్టో విడుద‌ల‌ కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్‌

Rahul Gandhi : తుక్కుగూడ‌లో కాంగ్రెస్ మ్యానీఫెస్టో విడుద‌ల‌… కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్‌పై రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్‌..!

అలాగే ఇక్కడ కెసిఆర్ చేసినట్లే కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్నారని , మోడీ వచ్చారంటే ముందు ఈడి వస్తుందంటూ తెలిపారు. భారతదేశంలో బీజేపీ పార్టీ అనేది పెద్ద వాషింగ్ మిషన్ లాగా మారిందని దీంతో దేశంలో ఉన్న అవినీతిపరులు అందరూ మోడీ కిందకు చేరారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా మోడీ మనుషులు ఉన్నారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ప్రపంచంలో ఎక్కడ జరగని అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది