Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగుల‌కి ఉద్యోగాలే ఉద్యోగాలు..!

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 9, 2025, 7:00 am
  •  Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగుల‌కి ఉద్యోగాలే ఉద్యోగాలు..!

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5,000 మంది నిరుద్యోగులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. తద్వారా ఆ డబ్బుతో యువత స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారని వివరించారు. ఈ రుణాలు రూ.50,000 నుంచి రూ.4 లక్షల వరకు ఉంటాయని చెప్పుకొచ్చారు.

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగుల‌కి ఉద్యోగాలే ఉద్యోగాలు..!

Rajiv Yuva Vikasam Scheme : రాజీవ్ యువ వికాసం ప్రారంభం.. ఇక నిరుద్యోగుల‌కి ఉద్యోగాలే ఉద్యోగాలు..!

Rajiv Yuva Vikasam Scheme ఈ నియ‌మాలు త‌ప్ప‌నిసరి..

ఈ ప‌థ‌కం ఉద్దేశం ఏంటంటే వాళ్లు రుణాలు తీసుకొని.. స్వయంగా పని చేసుకునే అవకాశం దీని ద్వారా కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన EWS వర్గాల యువత ఈ రుణాలు పొందుతారు. జూన్ 2న లబ్దిదారులైన యువతకు.. లోన్ సాంక్షన్ లెటర్లు ఇస్తారు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబ‌ట్టి అదే సందర్భంలో.. ఈ పథకం ప్రారంభమవుతుంది.రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు మాగ్జిమం రూ.4 లక్షల వరకు రుణం ఇస్తారు. ఇందులో 80% వరకు సబ్సిడీ ఉంటుంది.

అంటే.. తిరిగి చెల్లించే దాంట్లో.. 80 శాతం చెల్లించాల్సిన పని లేదు. అందువల్ల యువత రుణాలు తీసుకొని స్టార్టప్స్ ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 3 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. మొత్తం 5 లక్షల మంది యువతకు సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 16 లక్షళ 23 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్క హైదరాబాద్ జిల్లా నుంచే 1లక్షా 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.6,000 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో మైనారిటీ యువత కోసం రూ.840 కోట్లు కేటాయించారు. సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే, రూ.4 లక్షల లోన్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp