Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఓరుగల్లును రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మల వంటి వీర మహిళలు పాలించిన గడ్డగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ జిల్లా పురిటిగడ్డగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, మామునూరు ఎయిర్పోర్టు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.800 కోట్లతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను వెచ్చించడానికి వెనుకాడదని స్పష్టం చేశారు.
Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్
అలాగే గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఉచిత విద్యుత్ , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, తగిన నియామక ప్రక్రియలు చేపట్టామని, ఏడాదిలోనే 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వ దివాళా తీయించిన ఆర్థిక పరిస్థితిని తాము మెరుగుపరుస్తున్నామని, అయినప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు.
వరంగల్ అభివృద్ధికి కడియం శ్రీహరి, కడియం కావ్యల కృషిని కొనియాడిన సీఎం, ప్రజలు కావ్యను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడి వరంగల్ ఎయిర్‌పోర్టును, కాజీపేట రైల్వే డివిజన్‌ను సాధించగలమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యమైందని, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ మూడేళ్లే నిలవలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తాము సవాల్ విసురుతున్నామని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.