Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్

 Authored By ramu | The Telugu News | Updated on :16 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఓరుగల్లును రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మల వంటి వీర మహిళలు పాలించిన గడ్డగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ జిల్లా పురిటిగడ్డగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, మామునూరు ఎయిర్పోర్టు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.800 కోట్లతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులను వెచ్చించడానికి వెనుకాడదని స్పష్టం చేశారు.

Revanth Reddy దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy : దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy బిఆర్ఎస్ అప్పులు చేసినప్పటికీ మీము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం – రేవంత్

అలాగే గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఉచిత విద్యుత్ , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ తమ ప్రభుత్వం అందజేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, తగిన నియామక ప్రక్రియలు చేపట్టామని, ఏడాదిలోనే 55 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వ దివాళా తీయించిన ఆర్థిక పరిస్థితిని తాము మెరుగుపరుస్తున్నామని, అయినప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేయడం లేదని స్పష్టం చేశారు.

వరంగల్ అభివృద్ధికి కడియం శ్రీహరి, కడియం కావ్యల కృషిని కొనియాడిన సీఎం, ప్రజలు కావ్యను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడి వరంగల్ ఎయిర్‌పోర్టును, కాజీపేట రైల్వే డివిజన్‌ను సాధించగలమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యమైందని, లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ మూడేళ్లే నిలవలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తాము సవాల్ విసురుతున్నామని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది