Revanth Reddy : రేష‌న్ కార్డ్‌తో ఆరోగ్య‌శ్రీని లింక్ పెట్టొద్దు.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : రేష‌న్ కార్డ్‌తో ఆరోగ్య‌శ్రీని లింక్ పెట్టొద్దు.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Revanth Reddy : తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక ప‌రిస్థితులు మారాయి. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ
ప్ర‌జ‌ల మ‌న్న‌నలు పొందుతున్నారు. మంగళవారం రోజున సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వైద్య శాఖపై చర్చించిన రేవంత్ రెడ్డి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చూడాలని.. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని మరోసారి అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న అన్ని పథకాలను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాల్లోనూ ఆరోగ్య భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకునే పథకాన్ని అమలు చేయనున్నట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం.

Revanth Reddy అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు

ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త వినిపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా.. ఆరోగ్యశ్రీ పథక పరిధిని పది లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకానికి కూడా రేషన్ కార్డుతో లింకు పెట్టటంతో.. చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టొద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.మంగళవారం (జులై 16న) రోజున కలెక్టర్ల సదస్సు నిర్వహించిన రేవంత్ రెడ్డి.. ఆరోగ్య శ్రీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు ఎలాంటి లింకు పెట్టొద్దని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని సీఎం అన్నారు.

Revanth Reddy : రేష‌న్ కార్డ్‌తో ఆరోగ్య‌శ్రీని లింక్ పెట్టొద్దు.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Revanth Reddy : రేష‌న్ కార్డ్‌తో ఆరోగ్య‌శ్రీని లింక్ పెట్టొద్దు.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి