Home » Exclusive » Revanth Reddy First Signature As Cm Of Telangana On 6 Guarentee Schemes 2
Exclusive

Seethakka : సీతక్క పేరు పిలవగానే దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. గవర్నర్ షాక్.. సీతక్క క్రేజ్‌కి సోనియా, రాహుల్ ఫిదా

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 8, 2023, 7:10 pm
Advertisement

Seethakka : సీతక్క అనే నేను.. అంటూ సీతక్క తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి స్టేజీ మీదికి రాగానే ఒక్కసారిగా ఎల్బీ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణ డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పోడియం దగ్గరికి వచ్చిందో ఇక జనాల అరుపు చూడాలి. ఎల్బీ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. స్టేడియంలో ఉన్న జనాలు మాత్తం ఒక్కసారిగా కేకలు పెట్టారు. సీతక్క పేరు పిలిచిన తర్వాత, సీతక్క వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండగా జనాల అరుపులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై షాక్ అయ్యారు. ఇక.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా షాక్ అయ్యారు.

Advertisement

సీతక్క అనే నేను అని అనగానే మరోసారి జనాలు అరుపులతో గోల చేశారు. వాళ్ల కేకలను మాత్రం అస్సలు ఆపలేదు. సీతక్క ఇక చాలు ఆపండి అంటూ ప్రజలను చూస్తూ దండం పెట్టినా కూడా జనాలు ఆగలేదు. అనే నేను అంటూ గవర్నర్ మరోసారి సీతక్కతో ప్రమాణ స్వీకారం చేయాలని చెబుతారు. అయినా కూడా జనాలు మాత్రం ఆపరు. దీంతో గవర్నర్ కు ఏం చేయాలో అర్థం కాదు. అలాగే నవ్వుతూ ఉంటారు గవర్నర్. దనసరి అనసూయ సీతక్క అనే నేను అంటూ.. ఇక జనాల అరుపుల మధ్యనే సీతక్క తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.

Seethakka : ప్రమాణ స్వీకారం అనంతరం లేచి మరీ సీతక్కతో మాట్లాడిన సోనియా గాంధీ

ఇక.. సీతక్క ప్రమాణ స్వీకారం అనంతరం సీతక్కతో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు. అందరికీ సీతక్క ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డితో కలిసినప్పుడు కూడా జనాలు అరిచారు. ఆ తర్వాత సోనియా గాంధీ అయితే లేచి నిలబడి మరీ తనను కౌగిలించుకొని ధన్యవాదాలు తెలిపారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి