DSC Notification : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు సన్నద్ధం అవుతుంది. ముందుగా ఆరు గ్యారెంటీలలో రెండింటిని అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10లక్షలకు పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. ఇక మూడో హామీ రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ పై పెద్ద స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఇవన్నీ సంక్షేమ పథకాలకి కిందకు వస్తాయి. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరలోనే ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతున్నట్లు సమాచారం. వీలైనంత తొందరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తుందట. రెండు నెలల్లోనే ఉద్యోగాల భర్తీ చేయనున్నారని సమాచారం.
ఉద్యోగాల భర్తీ అంటే ముందుగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెడీ అవుతుందని సమాచారం. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో గ్రూప్స్ కు నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాల భర్తీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకనే ఈలోపు టీచర్ పోస్టుల భర్తీ చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అనుకున్నారట మొత్తం మీద భర్తీ చేయాల్సిన టీచర్ పోస్టులు 10,000 దాకా ఉన్నట్లు ప్రభుత్వానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు నివేదిక పంపారు. టీచర్ పోస్టులను భర్తీ చేయాలంటే పెండింగ్లో ఉన్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అడ్డుగా ఉంది. అందుకని ముందు ప్రమోషన్లతో పాటు బదిలీలను పూర్తి చేసి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది.
డీఎస్సీ నిర్వహించడం లేకపోతే టెట్ ద్వారా భర్తీ చేయాలా అనేది సమస్యగా మారింది. భర్తీ చేయాల్సిన పదివేల పోస్టులు పెండింగ్లో ఉన్న 2000 స్పెషల్ టీచర్ పోస్టులు కలిపి 12000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీగా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏడాదికి రెండు సార్లు డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. టెట్ ద్వారా భర్తీ చేద్దామనినుకున్న 5089 పోస్టుల నోటిఫికేషన్ కు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వీలైనంత తొందరలో చిన్న చిన్న వివాదాలను పరిష్కరించి ఒకేసారి 12000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.