Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ” తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇతను ఒక సంచలనం. ఎంతోమంది కొత్త డైరెక్టర్లకు ఇతను ఒక మార్గదర్శి అని కూడా చెప్పాలి. అలాగే ఒకప్పుడు రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు వర్ణాతీతం అని చెప్పాలి . ఏ డైరెక్టర్ చూపించలేని విధంగా , ఏ డైరెక్టర్ చేయలేని విధంగా రాంగోపాల్ వర్మ సినిమాలు చేసి చూపించేవాడు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలామంది రాంగోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్లుగా చేసి వచ్చినవారే.. అలాంటి రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో మనందరికీ తెలిసిందే. అంతేకాక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తన ట్విట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల గురించి ఆయన పెట్టే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. అయితే గతంలో కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండే విధంగా వర్మ సినిమాలు తీయడం జరిగింది.
ఇక ఇప్పుడు వ్యూహం అనే పేరుతో ఆంధ్ర రాజకీయాలను అచ్చు గుద్దేలా చంద్రబాబు నాయుడు, జగన్ , పవన్ కళ్యాణ్ పై తాజాగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీసిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలనే కసితో గోపాల్ వర్మ సినిమాను పూర్తి చేయడం జరిగింది. కానీ మధ్యలో ఈ సినిమాపై కేసు నడవడం వలన కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలి. ఇక ఇది ఇలా ఉండగా వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై కూడా పలు రకాల కామెంట్స్ చేశారు. అయితే రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ మీరు ఎప్పుడూ కూడా ఆంధ్ర రాజకీయాలను ఎక్కువగా చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా వాటిపైనే ట్విట్స్ చేస్తూ ఉంటారు. తెలంగాణ రాజకీయాల్లోకి మీరు ఎందుకు జోక్యం చేసుకోరని అడిగింది. దీనికి రాంగోపాల్ వర్మ సమాధానం ఇస్తూ నాకు రాజకీయపరంగా నాలెడ్జ్ అనేది శూన్యం.
ఇక ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తాను అంటే , నేను గతంలో తీసినటువంటి సినిమాల నుండి అలా కొనసాగుతూ వస్తున్నాను. అప్పుడే వైయస్ జగన్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. దానివలన నేను సినిమాలు తీస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు చాలా బాగా తెలిసిన వ్యక్తి అని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయాలపై మీరు సినిమాలు చేస్తారు ,అసలు చేసే అవకాశం ఉందా అని యాంకర్ అడిగినప్పుడు నేను చేస్తాను చేయను అనేది నాకే తెలియదు అంటూ రాంగోపాల్ వర్మ సమాధానమిచ్చారు. ఇది ఇలా ఉండగా రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడు అని చెప్పడంతో త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలలో కూడా రాంగోపాల్ వర్మ సినిమాలు తీసే అవకాశాలు ఉన్నట్లుగా పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.