Revanth Reddy : సీఎం అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి భాష మారదా..?
Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఆయన భాషలో ఏ మాత్రం తేడా రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన మాటలు సౌమ్యంగా లేవని, దూకుడుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి భాష పై కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. సీఎం హోదాలో ఉన్నప్పుడు మాట్లాడే భాష సరైనదిగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి భాష సౌమ్యంగా లేకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం చేజిక్కించుకోవడం కోసం దురుసుగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా మాట్లాడడం సరైనది కాదు అని అంటున్నారు. కొందరు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పరిపక్వత చెందలేదని అంటున్నారు. సీఎం అయిన తర్వాత మొదటి ప్రసంగంలో రేవంత్ రెడ్డి స్పీచ్ బాగానే ఇచ్చారు. దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు కూడా. అయితే రెండు నెలల పాలన తర్వాత రేవంత్ రెడ్డి భాష తీరు మారింది.
రీసెంట్ గా ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, దావోస్ వెళ్ళినప్పుడు తెలుగు ప్రజల గురించి ఆయన మాట్లాడిన తీరు కానీ అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. దీనిపై కొందరు సీరియస్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో సీఎం అయిన తర్వాత కూడా అలానే మాట్లాడుతున్నారు అన్, సీఎం హోదా లో ఉన్నప్పుడు సౌమ్యంగా మాట్లాడాలి కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా గడుసుగా మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. దీంతో చాలామంది సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకుంటే బాగుంటుందని అంటున్నారు. సీఎం అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఐడల్ గా ఉండాలి అని అంటున్నారు.
ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి భాష దురుసుగా ఉంటుంది. అంత దురుసుతనం సీఎం కి పనికిరానిది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఆయన భాషలో ఏమాత్రం తేడా లేదని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దురుసుగా మాట్లాడారో ఇప్పుడు సీఎం హోదాలో ఉండి కూడా ఆయన అంతే దురుసుగా మాట్లాడడంపై కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భాష సౌమ్యంగా ఉండాలని అంటున్నారు. రీసెంట్ గా ఇంద్రవెల్లి సభలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్‌స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్‌తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా…
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్…
This website uses cookies.