Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగు దేశం పార్టీ పూర్తిగా కనుమరుగు అయిన పరిస్థితుల్లో కూడా ఆ పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. పరిస్థితి మరీ చేయి జారి పోవడంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి జాయిన్ అయిన విషయం తెల్సిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు దక్కిన గౌరవం ఏంటీ అంటే వెంటనే వచ్చే సమాధానం మౌనమే. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కు అర్హుడే అయినా కూడా ఆయన్ను సీనియర్లు ఎదగనివ్వడం లేదు. సీనియర్లు పార్టీలో కి కొత్తగా వచ్చిన వారి విషయంలో వ్యవహరించినట్లుగానే రేవంత్ రెడ్డిపై వ్యవహరిస్తున్న కారణంగా ఆయన కు చాలా చిరాకుగా ఉందట.
కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం వల్ల ఆయన సొంతం పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మద్య కోదండరామ్ తో కలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి పార్టీ మారే విషయమై చాలా బలంగా వాదనలు వినిపిఐస్తున్నాయి. చాలా కాలంగా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి లాగేందుకు పార్లమెంట్ సాక్షిగా ప్రయత్నాలు జరిగాయంటూ వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డితో బీజేపీ మంత్రులు మరియు ఎంపీలు కూడా చర్చలు జరపడం జరిగింది. కాని రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీకి కాస్త దూరం అన్నట్లుగా ఉంటున్నాడు.
ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. లేదంటే టీఆర్ ఎస్ ముందు కాంగ్రెస్ చెతికిల్లా పడ్డట్లే అంటున్నారు. సాగర్ లో ఓడిపోతే మరో పదేళ్ల వరకు తెలంగాణలో అసెంబ్లీ లో విజయాన్ని కాంగ్రెస్ హించుకోవడం అసాధ్యం. అందుకే రేవంత్ రెడ్డి అప్పుడు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సాగర్ ఉప ఎన్నిక తర్వాత రేవంత్ రెడ్డి నిర్ణయం ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాని రేవంత్ రెడ్డి మరే పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తిగా లేడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏది నిజం అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.