Revanth Reddy : బిడ్డ నువ్వు నన్ను ఏం చేయలేవు… నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు పిల్ల…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Revanth Reddy : బిడ్డ నువ్వు నన్ను ఏం చేయలేవు… నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు పిల్ల…!

Revanth Reddy  : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలను సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకుల పై రేవంత్ రెడ్డి పలు రకాల ఆరోపణ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుచోట్ల ఎన్నికల ప్రచారాలను చేసిన రేవంత్ రెడ్డి తాజాగా మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ పై […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : బిడ్డ నువ్వు నన్ను ఏం చేయలేవు... నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు పిల్ల...!

Revanth Reddy  : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాలను సైతం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకుల పై రేవంత్ రెడ్డి పలు రకాల ఆరోపణ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుచోట్ల ఎన్నికల ప్రచారాలను చేసిన రేవంత్ రెడ్డి తాజాగా మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కేటీఆర్ పలు సందర్భాల్లో కారు రిపేర్ కి వచ్చిందని చెబుతున్నాడు. పిలగా కార్ రిపేరుకు రాలేదు , ఇంజన్ చెడింది ఇక తూకానికి వేయడమే తిరిగి వచ్చేది లేదంటూ రేవంత్ రెడ్డి ఏద్దెవా చేశారు. తూకానికి అమ్మటం తప్ప చేసేదేం లేదంటూ చెప్పుకొచ్చారు. నీ కారు మాత్రమే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అణువు చెడింది. ఏడో తారీఖు నాడు ప్రమాణస్వీకారం ఉంటే దానికంటే ముందే నీ అయ్య కేసీఆర్ బోర్లా పడ్డాడు. ఇప్పటికి నడవలేక పోతుండు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కారుని బండకేసి కొట్టి 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టిండ్రు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. అయినా కూడా పంకణాలు కొడుతూ పిట్టలదొర కేసీఆర్ నా కింద 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చిటిక కొడితే వస్తారని మాట్లాడుతుండు.

Revanth Reddy బిడ్డ నువ్వు నన్ను ఏం చేయలేవు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు పిల్ల

Revanth Reddy : బిడ్డ నువ్వు నన్ను ఏం చేయలేవు… నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు పిల్ల…!

చిటికె కాదు కొండపైకెక్కి డప్పు కొట్టు నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉండరంటూ తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్లమందలు ,తోడేళ్ల లాగా వచ్చి పట్టుకెళ్దాం అనుకుంటే , ఇక్కడ కాపల ఉంది రేవంత్ రెడ్డి అంటూ నన్ను దాటిపోవడం నీ తరం కాదంటూ చెప్పుకోచ్చారు. రేవంత్ రెడ్డికి తన వాళ్లని కంచె వేసి ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది