
Revanth Reddy : సీనియర్లను సైడ్ చేస్తున్న రేవంత్ రెడ్డి .. మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు ..!
Revanth Reddy : ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడు నెలల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు సమానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్లేవారు. ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రకటనలలో రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్కకు కూడా ప్రాధాన్యం లభించేది. ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్లో గతంలో కేసీఆర్ ఉన్న భవనాన్ని బట్టి విక్రమార్కకు కేటాయించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సొంత ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సీనియర్లకు ముఖ్యంగా భట్టి విక్రమార్కకు ప్రాధాన్యత తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పేపర్ ప్రకటనల్లో కూడా భట్టి విక్రమార్క కనిపించడం లేదు. ముఖ్యమంత్రిని నేనే కానీ భట్టి అన్న దగ్గర చెక్ పవర్ ఉంటుందని ఆదిలాబాద్ కి వెళ్ళినప్పుడు బహిరంగ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు.
అంటే ఆయన తనకంటే పవర్ఫుల్ అన్నట్లుగా గౌరవం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించిన భట్టి విక్రమార్కకు ఆ స్థాయి గౌరవం మొదటి నుంచి లభించింది. పేపర్లో కూడా రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క ఫోటో కనిపించేదిష ప్రతి కార్యక్రమంలోనూ భట్టి కనిపించేవారు. అయితే ఈ ప్రాధాన్యత రెండున్నర నెలలేష ఇప్పుడు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి పక్కన పెద్దగా కనిపించడం లేదు. అంతే కాకుండా ప్రభుత్వపరమైన ప్రకటనల్లో కూడా ఆయన ఫోటో కనిపించడం మానేసింది. దీంతో కాంగ్రెస్ లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ భట్టి విక్రమార్క సహా ఇతర నేతలు ఆ పార్టీలోనే పుట్టి పెరిగారు. వారికి మరో పార్టీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి కే ముఖ్యమంత్రి అవకాశం లభించింది. ఆయన మాస్ లీడర్ అన్న అభిప్రాయం. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించడంతోపాటు హై కమాండ్ యువ నేతలకు గట్టి నమ్మకస్తుడిగా మారడంతో ఈ ఛాన్స్ వచ్చింది.
పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి అవకాశం కల్పించాలని సీనియర్లు కూడా పోటీపడ్డారు. కారణం ఏదైనా రేవంత్ రెడ్డికి హై కమాండ్ ఛాన్స్ ఇచ్చింది. సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వాలని హై కమాండ్ చెప్పి ఉంటుంది. ఆ ప్రకారం ప్రారంభంలో రేవంత్ రెడ్డి సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూ వెళ్లారు. అందరూ సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సీనియర్ల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి రాజకీయం ప్రారంభించారని అభిప్రాయం వినిపిస్తుంది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి సీఎం అయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చాలామంది సీనియర్లు ఉండేవారు. వారందరిని క్రమంగా తన దారిలోకి తెచ్చుకొని తన పదవికి ఎవరు అడ్డు రాకుండా వారికి కావలసిన పదవులు ఇచ్చి తానే లీడర్ అని నిరూపించుకున్నారు. కొంతమంది సీనియర్లు ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది అని అంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అప్పట్లో రేవంత్ రెడ్డి జై ఉత్తమ్ కుమార్ అని నినాదాలు చేశారు.
కానీ ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వంలో కనీస ప్రాధాన్యత దక్కుతుందని విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కీలకమైన ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీలైనంత పొలైట్ గా ఉంటున్నారు. తన పనులు తాను చేసుకొని వెళ్ళిపోయేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హోం , మున్సిపల్ సహా కీలక శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ఇంకా మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లను గెలిపిస్తానని హై కమాండ్ కు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అందుకే అభ్యర్థుల విషయంలో చేరికల విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అన్న అభిప్రాయం వినిపిస్తుంది. మహబూబ్ నగర్ సీటుకు వంశీ చందర్ రెడ్డిని అభ్యర్థిగా ముందుగానే ప్రకటించారు. ఈయన కాంగ్రెస్ హై కమాండ్ పెద్దలకు సన్నిహితుడు. గెలుపు ఓటమిలో రేవంత్ రెడ్డిదే ప్రధాన బాధ్యత. ఒకవేళ ఎక్కువ స్థానాలు గెలిస్తే రేవంత్ రెడ్డి మరింత బలపడతారు. సీనియర్ల ప్రాధాన్యం తగ్గుతుంది. ఎంపీ సీట్లను గెలిపించలేక పోతే మాత్రం సీనియర్లు మరింతగా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.