YS Sharmila : ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?

Authored By Emmaneni | The Telugu News | Updated on : 4 July 2021, 4:40 pm

YS Sharmila జన్మనిచ్చిన తండ్రి దైవంతో సమానం.. అటువంటి వ్యక్తిని ఎవరైనా ఏమైనా అంటే, మండిపోద్ది.. అలాంటిది తన తండ్రిని దొంగ అంటున్నా, కనీసం స్పందించడం లేదు .. కనీసం ఖండించకపోవడం మరింత ఆజ్యానికి దారితీసింది. కన్నవారంటే, ప్రతి ఒక్కరికీ ప్రేమ, అభిమానం ఉంటుంది.. అది చెప్పనక్కరలేదు.. సమస్యలొస్తే, అదే వెల్లడవుతోంది. కానీ పదవే పరమావధిగా భావించేవారికి ఇటువంటివేవీ ఉండవని మరోసారి రుజువైంది.

వైఎస్ఆర్ నీళ్ల దొంగ..YS Sharmila

కొన్నిరోజులుగా రెండు తెలుగురాష్ట్రాల మ‌ధ్య వాట‌ర్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఏకంగా తెలంగాణ మంత్రులు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని.. ఆయ‌న కొడుకు జ‌గ‌న్‌ మోహన్ రెడ్డినీ వ‌ద‌ల‌కుండా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్ నీళ్ల దొంగ అయితే.. జ‌గ‌న్ గ‌జ‌దొంగ అంటూ ఘోరంగా అవ‌మానిస్తున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ కోడలినంటూ, రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ రాజ‌కీయాల్లోకి వస్తోన్న వైఎస్ ష‌ర్మిల తీరు అందరికీ కోపాన్ని తెచ్చిపెడుతోంది. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేది లేదు.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం.. అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్‌తోపాటు గ‌తంలో పార్టీ స‌న్నాహ‌కాల్లో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడిన మాట‌ల వీడియోనూ షేర్ చేశారు.

Ys Sharmila

Ys Sharmila

రాజన్న రాజ్యం .. ఇదేనా..YS Sharmila

తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగే ఏ ప్రాజెక్టునైనా అడ్డుకుంటామ‌ని.. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ‌తా.. కొట్లాడతా..నంటూ పంచ్ డైలాగ్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.. ఇప్పుడిదే.. అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. తండ్రిని, అన్నని తిడుతుంటే, కనీసం ఖండించకుండా, ఈ ట్వీట్ చేయడమేమిటంటూ మండిపడుతున్నారు. ఏ రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారో.. అదే రాజ‌న్న‌ను తెలంగాణ నీళ్లు దోచుకున్న నీళ్ల‌దొంగ అంటుంటే, పెదవి విప్పకపోగా.. ఈ ట్వీట్ ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రయోజనాలు తప్ప.. మానవతా విలువలేమీ పట్టవా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. షర్మిల ట్వీట్ తో రాజన్న అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనా రెండు రాష్ట్రాల మధ్య నీటియుద్ధం.. మాటెలా ఉన్నా షర్మిలమ్మ ట్వీట్ మాత్రం అందరినీ మండిస్తోంది.. మరి ఈ మంటను ఆమె ఎలా ఆర్పుతారన్నదే కీలకంగా మారింది.

Emmaneni

No bio available for this author.

  1. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  2. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  3. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  4. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  5. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

  6. "Astrology : శని అనుగ్రహంతో ఈ 2 రాశుల వారికి భారీ అదృష్టం.. వచ్చే 3 ఏళ్లు శుభయోగమేనా?"

  7. "Rajamouli : మహేష్ వారణాసి సినిమా కథ ఇదేనా ?.. రాజమౌళి మాటలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp