Home » Exclusive » Siddipet Collector Given Laptop To Telangana Top Student
Exclusive

Siddipet Collector : సిద్దిపేట బిడ్డ ఆర్యన్ రోషన్ ఐఐటీలో చేరుతాడిక..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 26, 2024, 10:05 pm
Advertisement

Siddipet Collector : చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు ద్వారా తిరుపతి ఐఐటీలో సీటు సాధించాడు.

Advertisement

పేదరికం కారణంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్యన్ రోషన్ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ మను చౌదరి గారు శుక్రవారం నాడు ఆ విద్యార్దిని కలెక్టరేట్ కార్యాలయానికి పిలిపించారు. ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో సీటు పొందిన ఆర్యన్ రోషన్ కు సెమిస్టర్ ఫీజు నిమిత్తం రూ.36,750 చెక్కును అందజేశారు.

siddipet collector given laptop to Telangana Top student

Advertisement

అలాగే చదవు అవసరాల నిమిత్తం రూ. 40,500 విలువైన ల్యాప్ టాప్ ను కూడా కొనిచ్చారు. భవిష్యత్తులోనూ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని, ఐఐటీలోనూ రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థి ఆర్యన్ రోషన్ కు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, ఇతర అధికారులు కూడా ఉన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి