Fine Rice : సన్నబియ్యం రేషన్ పంపిణీ వారికి కట్..!
ప్రధానాంశాలు:
Fine Rice : సన్నబియ్యం రేషన్ పంపిణీ వారికి కట్..!
Fine Rice : పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని రేవంత్ తెలియజేశారు. అయితే భూపాల పట్టణంలోని 16వ వార్డ్‌లో సన్నబియ్యం రేషన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ఎన్నికలు జరిగే ప్రాంతాలలోనే రేషన్ కార్డులు ఇచ్చింది. కాని మన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులని అందిస్తుందని అన్నారు.

Fine Rice : సన్నబియ్యం రేషన్ పంపిణీ వారికి కట్..!
Fine Rice వారికి చెక్..
ఇక గత ప్రభుత్వం ధరణి పేరుతో దగా చేసి పేదల భూములని లాక్కుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దగాకి చెక్ పె్టింది. అనర్హుల రేషన్ కార్డులని తొలగించి అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందేలా చేస్తామని ఆయన అన్నారు. ధనవంతులు తినే సన్నబియ్యం పేద వారు కూడా తినాలనేదే మా సంకల్పం.
గతంలో రేషన్ షాపుల ద్వారా తొమ్మిది వస్తువులు ఇచ్చాం. ఇప్పుడు ఆ పరిస్థితిని మళ్లీ తీసుకొస్తాం అని శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలని సరిదిద్ధి నిజమైన అర్హులకి ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సన్నబియ్యం విషయంలో వివాదాలు మొదలయ్యాయి. సన్నబియ్యం పథకంలోని మెజార్టీ ఖర్చు భరిస్తోంది కేంద్రమే అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఒక్కో కిలోకు రూ.40లు కేంద్రం చెల్లిస్తోందన్నారు. సన్న బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం 10 మాత్రమేనన్నారు