Home » News » Telangana Cabinet Expansion 2025
News

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 8, 2025, 12:30 pm
Advertisement

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. వివేక్​, అడ్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ ​(మాల), అడ్లూరి లక్ష్మణ్ ​(మాదిగ), బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి (ముదిరాజ్​)కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. నూతన మంత్రులకు సీఎం రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ముగ్గురు మంత్రులు..

ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల‌కి రాజ్​భవన్​లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆ వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకున్నారు.అయితే మాదిగ సామాజికవర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి Sudarshan Reddy కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం.

Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌ రెడ్డిని Venkat Reddy కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది. వీటితో పాటు చీఫ్‌ విప్‌ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్‌ ప్రస్తుతం శాసనసభలో విప్‌గా ఉన్నారు.వికారాబాద్‌ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి