Womens : తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త తీసుకువచ్చింది. అర్హులైన మహిళలకు దాదాపు రూ.2.5 లక్షల స్వయం ఉపాధి రుణంగా ఇవ్వనుంది. అయితే ఇది అందరికీ వర్తించదని చెప్పాలి. ఈ అవకాశం కేవలం మీసేవ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వారికి మాత్రమే. అయితే రాష్ట్రంలో మీసేవ కేంద్రాల ద్వారా అనేక రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు ప్రజలకు అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీసేవ కేంద్రాలు ఎక్కువ మొత్తంలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. దీంతో ఏదైనా దరఖాస్తు సమయంలో మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. మరి ముఖ్యంగా మండల కేంద్రాలలో ఉన్నటువంటి మీసేవ సెంటర్ల వద్ద జనం ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఏదైనా ప్రభుత్వ పని జరగాలంటే రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ సమస్యపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సరికొత్త విధానాన్ని తీసుకురాబోతుంది.
ప్రస్తుతం మీసేవ కేంద్రాల వద్ద ప్రజలు ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం ప్రతి గ్రామంలో మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లేదా అంగన్వాడీ కేంద్రాలలో వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ మీసేవ సెంటర్లను నడిపించే బాధ్యత మాత్రం మహిళలకు ఇవ్వనున్నారు. తద్వారా మహిళలకు ఉపాధి కల్పించిన వారు అవుతారు.అంతేకాక మహిళలకు ముందుగానే మీసేవ సెంటర్లను ఎలా నిర్వహించాలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కావలసిన రుణ సదుపాయం కూడా కల్పించనున్నారు.
ఇంటర్ పాసైన మహిళలు ఈ మీసేవ సెంటర్లు నడిపే బాధ్యతలను తీసుకోవచ్చు. కానీ వీరు స్వయం సహాయక సంఘాల సభ్యులై ఉండాలి.ఈ సంఘాలలో ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంద. ఇక ప్రభుత్వ శిక్షణ పూర్తయిన తర్వాత మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయడానికి రూ.2.5 లక్షలు అందిస్తారు. ఈ రుణ సదుపాయంతో ఆయా గ్రామాల్లోని అంగన్వాడి లేదా ప్రభుత్వ పాఠశాలలో మీసేవ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి గ్రామంలో మీసేవ సెంటర్ ఏర్పాటు అవుతుంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు వారి యొక్క సొంత గ్రామం లోనే వివిధ రకాల ప్రభుత్వ పనులను పూర్తి చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.