Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో అనేక పథకాలు తీసుకొస్తూ ప్రజలకి దగ్గర అవుతున్నారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధికారికంగా యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. తక్కువ స్థలంలో రెండు గదులు, వంటగది, బాత్రూం వంటివి ఉండేలా ఇంజినీర్లు చేసిన ఆకృతులను ఈ యాప్‌లో ఉంచారు. దీన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. దరఖాస్తుదారుల వివరాలను ఎంట్రీ చేసి… లబ్ధిదారులను గుర్తిస్తారు. యాప్ అందుబాటులోకి రావటంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియ వేగవంతం కానుంది.
ఇందులో ఇంటికి వచ్చే సర్వేయర్లు… దరఖాస్తుదారుడి అన్ని వివరాలను సేకరిస్తారు. గతంలో ఏదైనా ఇంటి స్కీమ్ లో లబ్ధి పొందారా..? ఎలాంటి వాహనాలు ఉన్నాయి..? స్థలం ఎవరి పేరుపై ఉంది..? కుటుంబంలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా..? ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపుతో పాటు ఇతర వివరాలను తీసుకుంటారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ముఖాన్ని గుర్తిస్తారు. ఇంటి స్వరూపాన్ని ఇదే పద్ధతిలో గుర్తిస్తారు. ఇంటిని నిర్మించే స్థలానికి భౌగోళిక వివరాలు నమోదు చేస్తారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఏఐ ఆధారిత ఫొటోలు తీస్తారు. లబ్ధిదారుడికి ఇచ్చే సొమ్ము ఆధార్ ఆధారిత బ్యాంకుకు బదిలీ చేసేందుకు ఏఐనే వినియోగించుకోనున్నారు.
ఇదే క్రమంలో ప్రజల సమస్యలకి చెక్ పెట్టేందుకు మై పంచాయతీ అనే యాప్ తీసుకురాబోతున్నారు. దాదాపు 20 రకాల సేవలు ఆన్‌లైన్‌లో అందించేలా ఈ యాప్ రూపొందిస్తున్నారు.జనన, వివాహ, మరణ, ఇంటి నిర్మాణ అనుమతి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా చాలా పథకాలు, సర్టిఫికెట్లు మొత్తం కూడా ఈ యాప్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఆర్ధిక భారం తప్పడంతో పాటు సమయం ఆదా అవుతుంది. త్వరగా సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
Cancer Vaccine : ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణ. రష్యా ప్రభుత్వం తన స్వంత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు…
Ind Vs Aus : ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఎంతటి మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు టెస్ట్‌ల…
Winter : చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో నారింజ పండ్ల లాంటివి తినడానికి వెనకాడుతారు. ఎందుకంటే జలుబు,దగ్గు, ఫ్లూ,…
Phone And Laptop : ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ లాప్టాప్ కి లేదా ఫోన్లకి అతుక్కొని పోతున్నారు. ఇలా…
2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి.…
Chukkakur : ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అటువంటి ఆకుకూరలో ఒకటైన ఆకు కూర చుక్కకూర. ఈ…
Zodiac Signs : గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు జనవరి 15వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. నెల…
One Nation One Election : పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ…
This website uses cookies.