New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
ప్రధానాంశాలు:
New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
New Ration Cards : తెలంగాణ Telangana ప్రభుత్వం రేషన్ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకరాబోతుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. బీపీఎల్ (బిలో పోవర్టీ లైన్) వర్గాలకు మూడు రంగుల రేషన్ కార్డులు, ఎపీఎల్ (అబవ్ పోవర్టీ లైన్) వర్గాలకు ఆకుపచ్చ రంగు కార్డులు జారీ చేయనున్నారు. కొత్త కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు మరియు త్వరలోనే కొత్త కార్డులను ప్రజలకు అందజేయనున్నారు.

New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
New Ration Cards : కొత్త రేషన్ కార్డు లకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
రేషన్ బియ్యం పంపిణీలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర జనాభాలో 84 శాతం మంది సన్న బియ్యం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క వ్యక్తికి నెలకు 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. గతంలో పంపిణీ అయిన బియ్యంలో 80-90 శాతం వృథాగా మారినప్పటికీ, ప్రస్తుతం సరఫరా అవుతున్న బియ్యం పూర్తిగా సద్వినియోగం అవుతోందని మంత్రి తెలిపారు.
ఇక వడ్ల సేకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8,209 కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 2,573 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. తేమ శాతం 17కు పైగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 2.81 కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతుండగా, కొత్త దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ సంఖ్య 3.10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో మాత్రం ఎన్నికల కమిషన్ అనుమతి లేనందున తాత్కాలికంగా పంపిణీ నిలిపివేసినట్టు చెప్పారు. ఎన్నికల తర్వాత మళ్లీ పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.