Categories: NewsTelangana

AIYF : ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి : ఏఐవైఎఫ్

AIYF  : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లోని తెలంగాణ Telangana హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హోంగార్డుల పక్షాన తెలంగాణ సచివాలయంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఐపీఎస్ రవి గుప్తా కు ఏఐవైఎఫ్ బృందం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ లు సంయుక్తంగా మాట్లాడుతూ గత 11సంవత్సరాలుగా తెలంగాణ స్థానికతకు చెందిన హోంగార్డులు ఆంధ్రప్రదేశ్ లో విధులు , అదే విధంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ హోంగార్డులు పనిచేస్తున్నారన్నారు.

AIYF : ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ హోంగార్డులను స్వరాష్ట్రానికి బదిలీ చేయాలి : ఏఐవైఎఫ్

AIYF  ఏఐవైఎఫ్ బృందం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతి

తెలంగాణ Telangana స్థానికతకు చెందిన హోంగార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెలక్ట్ అయినారు. రాష్ట్ర విభజన జూన్, 2014 తరువాత వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయారని, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చడం జరిగినా, హోంగార్డులను మార్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణకు చెందిన హోంగార్డులు పనిచేస్తున్నారని, ఆ కుటుంబాలు తెలంగాణ లో ఉన్నాయన్నారు. దీనివలన వారు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ లో, కుటుంబం తెలంగాణ లో ఉండటంవలన, మానసికంగా, కుటంబపరంగా, డ్యూటికి హాజరుకావడానికి, రవాణాపరంగా, ఆర్థికంగా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. హోంగార్డుల తల్లితండ్రులు వృద్దాప్యంలో ఉండంటం వలన, వారి బాగోగులు చూసుకోలేకపోతున్నారన్నారు.కొంతమంది పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో విద్యను కొనసాగిస్తున్నారని. వారు భవిష్యత్తులో తెలంగాణ స్థానికతను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర విభజన జూన్ 2014 నుంచి దాదాపుగా ’11’ సంవత్సరాలుగా స్వరాష్ట్రాలకు వెళ్ళాలని ఎదురుచూస్తున్నా, వారి సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం చెందారని వాపోయారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కు హోంగార్డ్స్ బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని తెలిపినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలయాపన చేసి స్పందించలేదన్నారు. తెలంగాణ హోంగార్డులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ లకు, పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. సత్య ప్రసాద్,ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ పాల్గొన్నారు.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

2 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

3 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

4 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

5 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

6 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

7 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

8 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

8 hours ago