
Telangana : గుడ్ న్యూస్.. ఆరు నెలల్లో తెలంగాణలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్..!
Telangana : ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది నిత్యావసరం అయింది. దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఇంటర్నెట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా టెక్నాలజీపై ఫోకస్ పెంచుతోంది. రాష్ట్రంలో డిజిటల్ విప్లవం దిశగా మరో ముందడుగు వేస్తూ, టీ-ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల మంత్రి డీ.శ్రీధర్ బాబు తెలిపారు.
Telangana : గుడ్ న్యూస్.. ఆరు నెలల్లో తెలంగాణలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్..!
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రతి ఇంటికీ, ఆఫీసుకీ అత్యాధునిక ఇంటర్నెట్ సేవలు అందిస్తామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వ డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి సావరిన్ క్లౌడ్ సేవలను మంత్రి ప్రారంభించారు. అంతేకాకుండా, టీ-ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. టీ-ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లో 8,891 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసింది. మరో 7,187 పంచాయతీలు సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించాం. 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధానం చేస్తాం” అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇకపై టీ-ఫైబర్ ‘టీ-నెక్స్ట్’ పేరుతో సేవలు అందిస్తుందనీ, కేబుల్ ఆపరేటర్ల సహకారంతో లాస్ట్ మైల్ వరకు టీవీ ఛానెల్ సదుపాయాలను కూడా అందిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం టీవీ సెట్లను కంప్యూటర్ మానిటర్‌గా ఉపయోగించేలా టెక్నాలజీని డెవలప్ చేసినట్లు శ్రీధర్ బాబు వివరించారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.