Thagubothula Sangam : తాగి కాలవలో పడిపోతే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్..!
Thagubothula Sangam : మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ ఇటీవల తెగ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన రీసెంట్‌గా మద్యం ప్రియుల బాధలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆయన చేసిన ప్రయత్నం 24 గంటలలోనే ఫలించడం విశేషం . మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న వైన్ షాప్లు, బార్లలో కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.ఈ క్రమంలో మందు బాబుల ఆనందానికి అవధులు లేవు. ఇక తమ బీర్ల దాహం తీర్చారని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ను శాలువా కప్పి సన్మానించారు తాగుబోతులు .
అనంతరం తరుణ్ మాట్లాడుతూ.. తాగుబోతుల డిమాండ్లను వినిపించారు. ఎక్కడైతే తాగుబోతులు అనారోగ్యంపాలై ఆసుపత్రులకు వెళ్తారో.. వాళ్లకి తాగుబోతు అని తెలవగానే 25 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తాగుబోతులను మానసిక వికలాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం వారికి నెలకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని తెలియజేశారు. తాగి నడుచుకుంటూ వెళ్తుంటే కిందపడి కాళ్లు చేతులు విరిగినట్లయితే వారికి ప్రభుత్వం తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని.. ఒకవేళ వాహనం నడుపుతూ చనిపోయినట్లయితే బాధిత కుటుంబానికి 5 లక్షలు సాయం అందించాలంటూ కూడా ఆయన డిమాండ్‌లో తెలియజేశారు.
Thagubothula Sangam : తాగి కాలవలో పడిపోతే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలంటూ తాగుబోతుల సంఘం డిమాండ్..!
తాగుబోతులు వాళ్ల ఆరోగ్యాన్ని, ఆస్తులను ప్రభుత్వానికి దారబోస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు కాబట్టి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్ధిక సాయం అందించాలని కూడా తరుణ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వంతో వీరితో చర్చలు జరపాలని, తమ న్యాయమైన డిమాండ్‌లను నెరవేర్చాలని కోరనున్నట్టుగా కొట్రంగి తరుణ్ పేర్కొన్నారు. కాగా, తరుణ్ రీసెంట్‌గా మంచిర్యాలలోని పలు వైన్ షాపుసు, బార్లను సందర్శించి కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరుకుతున్న విషయం తెలుసుకొని సంతోషించాడు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.