Thummala Nageswara Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటలని ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అయితే రైతుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి అన్నదాతకు మరింత వెసులుబాటు కల్పించేలా ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా జొన్నలు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జొన్న రైతులకు సూచించారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల జొన్న రైతుల విజ్ఞప్తి మేరకు, సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఎకరాకు 8.85 నుంచి 12 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచుతుందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాల్‌కు రూ.3180 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు.
కొనుగోలు ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌కు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జొన్నల కొనుగోళ్లు ప్రారంభించిన మార్క్‌ఫెడ్ క్వింటాల్‌కు రూ.3,180చొప్పున రైతులకు చెల్లిస్తోంది. జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు పంటను విక్రయించొద్దని మంత్రి సూచించారు.పెంచిన పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతులవద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఎకరాకు 8.85 క్వింటాళ్ల జొన్నలే కొనాలని ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితులు విధించిందని, ఆ పరిమితిని పెంచాలంటూ కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తమ బాధలని చెప్పుకున్నారు.
అయితే వారి విజ్ఞప్తి మేరకు అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ తాజాగా ఆదేశాలివ్వడంతో వారిలో సంతోషం వెల్లివెరిసింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 1.05 లక్షల ఎకరాల్లో జొన్న పంటను గత అక్టోబరు నుంచి మార్చి వరకూ రబీ సీజన్‌లో పండించడం మనం చూశాం.ఇప్పుడు 14 లక్షల క్వింటాళ్లకి పైగా దిగుబడి వస్తుందని బావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని పెంచడం వల్ల ఎకరానికి ప్రతి రైతుకు తప్పనిసరిగా మద్దతు ధర కింద 12 క్వింటాళ్లకు రూ.38,160 అందునుందని అంటున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.