Categories: NewsTelangana

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Advertisement
Advertisement

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది. తాజాగా హైడ్రా రికార్డ్ సృష్టించింది. అమీన్ పూర్ లో బిగ్ ఆపరేషన్ ను పూర్తి చేసింది. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు చేపట్టింది. రాత్రి ఒంటి గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. పటేల్ గూడలో 16 విల్లాలను కూల్చి వేశారు. ఒక హాస్పిటల్, 2 అపార్ట్ మెంట్లను కూడా అధికారులు కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత పగలు, రాత్రి ఆపరేషన్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. అక్రమ నిర్మాణాలకు ఆనుకుని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Hydra హైడ్రా స్పీడ్..

మొత్తం మూడు ప్రాంతాలలో కూల్చివేతలతో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. భారీగా పోలీసులను మోహరించి కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా అధికారుల పైన అక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కూకట్ పల్లిలోని నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేసే సమయంలో అక్కడ స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. కనీసం తమకు రెండు నెలల గడువైనా ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయినా హైడ్రా కనికరించలేదు. నా భార్య కడుపుతో ఉంది సామాన్లు తీసుకునే టైమ్ కూడా ఇవ్వరా అంటూ ఓ బాధితుడు వాపోతున్నా పట్టించుకోలేదు.

Advertisement

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. తమకు శనివారం సాయంత్రమే సమాచారం ఇచ్చారని వాపోయారు. మరోవైపు తము నోటీసులు ఇచ్చామని హైడ్రా చెప్పుకొస్తుంది. కిందపడి దొర్లి దొరలు ఏడ్చారు. ఇది చాలా అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందే చెబితే అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలలో షాపులు ఏర్పాటు చేసుకునే వారిమని, అలా కాకుండా అకస్మాత్తుగా వచ్చి కూల్చివేతలకు పాల్పడడం దారుణమని వారు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నడిరోడ్డుకు లాగిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.

Advertisement

Recent Posts

Farmers : రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త .. మ‌ద్ద‌తు ధ‌ర పెంపుతో ఎక‌రాకు రూ.10 వేలు పొందే అవ‌కాశం

Farmers : సూపర్‌ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం…

56 mins ago

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..!

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా…

4 hours ago

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు…

5 hours ago

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం…

6 hours ago

SBI Foundation : విద్యార్థులకు 15 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల స్కాలర్‌షిప్

SBI Foundation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగమైన SBI ఫౌండేషన్, దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి…

7 hours ago

Devara Pre Release : దేవ‌ర ప్రీ రిలీజ్‌కి బాధ్యులెవ‌రు… ఈవెంట్ ఎందువ‌ల‌న ఆగింది ?

Devara Pre Release : యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న…

8 hours ago

Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!

Chanakyaniti : ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. తన జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాలను కూడా…

9 hours ago

This website uses cookies.