Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది. తాజాగా హైడ్రా రికార్డ్ సృష్టించింది. అమీన్ పూర్ లో బిగ్ ఆపరేషన్ ను పూర్తి చేసింది. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు చేపట్టింది. రాత్రి ఒంటి గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. పటేల్ గూడలో 16 విల్లాలను కూల్చి వేశారు. ఒక హాస్పిటల్, 2 అపార్ట్ మెంట్లను కూడా అధికారులు కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత పగలు, రాత్రి ఆపరేషన్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. అక్రమ నిర్మాణాలకు ఆనుకుని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

Hydra హైడ్రా స్పీడ్..

మొత్తం మూడు ప్రాంతాలలో కూల్చివేతలతో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. భారీగా పోలీసులను మోహరించి కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా అధికారుల పైన అక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కూకట్ పల్లిలోని నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేసే సమయంలో అక్కడ స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. కనీసం తమకు రెండు నెలల గడువైనా ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయినా హైడ్రా కనికరించలేదు. నా భార్య కడుపుతో ఉంది సామాన్లు తీసుకునే టైమ్ కూడా ఇవ్వరా అంటూ ఓ బాధితుడు వాపోతున్నా పట్టించుకోలేదు.

Hydra గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ.. కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా.. హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. తమకు శనివారం సాయంత్రమే సమాచారం ఇచ్చారని వాపోయారు. మరోవైపు తము నోటీసులు ఇచ్చామని హైడ్రా చెప్పుకొస్తుంది. కిందపడి దొర్లి దొరలు ఏడ్చారు. ఇది చాలా అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందే చెబితే అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలలో షాపులు ఏర్పాటు చేసుకునే వారిమని, అలా కాకుండా అకస్మాత్తుగా వచ్చి కూల్చివేతలకు పాల్పడడం దారుణమని వారు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నడిరోడ్డుకు లాగిందని కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది