Home » News » White Ration Card Holders Can Apply Labour Insurance Card
News

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 23, 2024, 5:00 pm
Advertisement

Labour Insurance Card : మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..? అయితే మీరు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కూడా పొందవచ్చు. ఏడాదికి రూ.22 చొప్పున ఐదేళ్లకు కలిపి చెల్లించాల్సింది కేవలం రూ. 100 మాత్రమే. ఈ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

Advertisement

Labour Insurance Card డాక్యుమెంటేషన్

లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి కింది పత్రాలను సమర్పించాలి
– లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న స్త్రీ. పురుషులు అర్హులు.
– ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన, ఇతరులైన ఇందులో చేరవచ్చు.
– రేషన్ కార్డు (తెల్ల కార్డు)
– ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు
– బీమా ప్రీమియం చెల్లింపును చూపించే బ్యాంక్ చలాన్, దానిని తప్పనిసరిగా కార్మిక కార్యాలయానికి సమర్పించాలి .

Labour Insurance Card ప్రీమియం చెల్లింపు

– ఈ బీమా పథకం మొత్తం ప్రీమియం రూ. 110, ఐదేళ్ల పాటు అడ్వాన్స్‌గా చెల్లించాలి. ఇది రూ. సంవత్సరానికి 22 , అందించిన ప్రయోజనాలతో పోలిస్తే ఇది కనిష్ట ధర.
– ఒక్కసారి చెల్లింపు రూ. 110 ఐదేళ్లపాటు కవరేజీని నిర్ధారిస్తుంది, వార్షిక చెల్లింపులు చేయాల్సిన అవసరం నుండి లబ్ధిదారులకు ఉపశమనం ల‌భిస్తుంది.

Advertisement

ప్రయోజనాలు :   పాలసీదారు సహజ మరణం పొందితే రూ. 1,30,000 అందుతాయి. అలాగే ప్రమాదవశాత్తూ మరణం జరిగే రూ. 6,00000 ఇన్సూరెన్స్ అందుతుంది.
– ఒక ఇంట్లో ఇద్దరు అడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000 అందుకుంటారు.
– ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు రూ. 30,000 చొప్పున వచ్చే అవకాశం ఉంది.

Labour Insurance Card : తెల్ల రేషన్ కార్డుదారులు లేబర్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు

Advertisement

– ఒక సంవత్సరం పాలసీ పొందిన తరువాత లబ్దిదారునికి ప్రమాదం జరిగి 50 శాతం దివ్యాంగుడిగా ఉంటే 2.50 లక్షలు అందుతాయి. అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
– ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకేసారి 110/- రూ. చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/- రూ మాత్రమే.
– ఈ కార్డు తీసుకోవాలనుకునే వారు మీ మండలంలోని కార్మిక అధికారిని (లేబర్ ఆఫీసర్) లేదా ఎంపీడీఓ,,తహసీల్దార్ ను సంప్రదించవచ్చు.
– ఈ పథకంలో చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులు అవుతారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి