Home » Andhra Pradesh » What Is The Main Business Of Astrologer Venu Swamy
andhra pradesh

Venu Swamy : బయట పడ్డ వేణు స్వామి వ్యాపార దందా.. జాతకాలు సైడ్ బిజినెస్ మాత్రమే.. అసలు బిజినెస్ ఇదే

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 26, 2023, 12:00 pm
Advertisement

Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సలార్ మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని.. ప్రభాస్ కెరీర్ బాహుబలితోనే క్లోజ్ అని ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఒక్క హిట్ కూడా పడలేదు. సాహో అట్టర్ ఫ్లాప్. రాధే శ్యామ్ అట్లర్ ఫ్లాప్. ఆది పురుష్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మాత్రం మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో నిరూపించింది. మరోసారి బాహుబలి ప్రభాస్ ను అంతకు మించిన ప్రభాస్ ను సలార్ లో చూశాం. దీంతో వేణుస్వామి మీద సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయింది.

Advertisement

వేణు స్వామి చెప్పినట్టుగా ఏం కాలేదని.. ప్రభాస్ కెరీర్ క్లోజ్ అవుతుందని చెప్పాడు కానీ.. ప్రభాస్ స్టార్ డమ్ ఇంకాస్త పెరిగిందని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నిజానికి ఇప్పటి వరకు ఆయన చెప్పిన జాతకాలు అన్నీ నిజమే అయ్యాయి. సమంత, నాగ చైతన్య విడాకుల విషయం కూడా ఆయన ముందే చెప్పారు. అందుకే ఆయన చేసే వ్యాఖ్యలపై అంత దుమారం లేస్తుంది. అయితే.. ప్రస్తుతం వేణు స్వామికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి జాతకాలు మాత్రమే చెప్పడం వేణు స్వామి పని కాదట. అది కేవలం సైడ్ బిజినెస్ అట. ఆయనకు మెయిన్ బిజినెస్ వేరే ఉందట. ఆయన మెయిన్ బిజినెస్ ఏదో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Venu Swamy : పబ్ బిజినెస్ లో ఉన్న వేణు స్వామి

ఆయనకు ఒక పబ్ ఉందట. అదే మెయిన్ బిజినెస్ అట. హైదరాబాద్ లో పెద్ద పబ్ ఉందట. ఆయన జాతకం ప్రకారం ఏ రంగంలో తనకు కలిసి వస్తుందో చెక్ చేసుకొని పబ్ రంగంలోకి అడుగు పెట్టారట. పబ్ రంగం అయితేనే తనకు బాగుంటుందని అనుకొని అందులో పెట్టుబడులు పెట్టారట. ఇప్పుడు ఆయన పబ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. జాతకాలు కేవలం టైమ్ పాస్ కోసం లేదంటే తను ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉండటం కోసం, ఫేమ్ కోసం సెలబ్రిటీలకు జాతకాలు చెబుతుంటారు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటారు. ఇది వేణు స్వామి అసలు జాతకం.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి