ys sharmila to give support to congress party
YS Sharmila : అనుకున్నట్టుగానే వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజలకు, పాలేరు ప్రజలకు షాకిచ్చారు. చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న సస్పెన్స్ కు నేడు ముగింపు పలికారు వైఎస్ షర్మిల. తెలంగాణలో పోటీ చేయడం లేదని.. ఈసారి వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని తాజాగా ప్రకటించారు. వైఎస్ షర్మిల ఈసారి పోటీ చేయకుండా, తమను పోటీ చేయనీయకుండా మోసం చేశారని.. వైఎస్సార్టీపీ నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే తమ నేతలతో సమీక్ష నిర్వహించిన వైఎస్ షర్మిల తాజాగా ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇస్తున్నా అంటూ వైఎస్ షర్మిల ప్రకటించారు.
మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు కాబట్టే కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ. పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి. నన్నేం చేయమంటారు. మొండిగా తెగించి నిలబడమంటారా? పొంగులేటిని ఓడించమంటారా? నన్ను ఓడిపోమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? గెలుపు ముఖ్యమే, గెలుపు గొప్పదే. కానీ.. త్యాగం అంతకంటే గొప్పది. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతోంది రాజశేఖర్ బిడ్డ. ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా. ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలనేది నా కోరిక అంటూ షర్మిల కంటతడి పెట్టుకున్నారు.
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…
Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి…
Moong Vs Masoor Dal | భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటంతోపాటు…
Health Tips | చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి రోజు వాడాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.…
Health Tips | కాలానికి అతీతంగా ఆరోగ్యాన్ని బలోపేతం చేసే పానీయాల గురించి మాట్లాడుకుంటే కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ…
This website uses cookies.