
Kalvakuntla Kavitha about on Huzurabad bypoll
Kalvakuntla Kavitha చాలా కాలం పాటు తెలంగాణ Telangana రాజకీయాల్లో సిఎం కేసిఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత అడ్రెస్ లేని విషయం తెలిసిందే. ఎప్పుడైతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో అప్పటినుంచి కవిత కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. అయితే కేసిఆర్ ఫ్యామిలీలో అందరూ ఏదొక పదవిలో ఉన్నారు. దీంతో కుమార్తెని రాజకీయ నిరుద్యోగం నుంచి తప్పించడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండకపోయినా తన ఫ్యామిలీకి మాత్రం ఏదొక ఉద్యోగం ఉండాలనే కోణంతో కేసిఆర్..కవితకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి వచ్చాక కవిత నిదానంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం మొదలుపెట్టారు. పైగా బతుకమ్మ పండగ వస్తుండటంతో కవిత మళ్ళీ తెలంగాణ పోలిటికల్ స్క్రీన్‌పై సందడి చేయడం మొదలుపెట్టారు.
Kalvakuntla Kavitha about on Huzurabad bypoll
పనిలో పనిగా హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి కూడా కామెంట్ చేశారు. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ విజయం ఖాయమని స్ట్రాంగ్‌గానే చెప్పి, తర్వాత మంచి లాజిక్ ఒకటి చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజేపి గెలిస్తే సిఎం కేసిఆర్ రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ..పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలిచారు కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతాని ఓడించాలని బిజేపి ఛాలెంజింగ్‌కు పనిచేసి ఓడిపోయారు కాబట్టి, దానికి మోదీ బాధ్యత వహిస్తారా? అని అడిగారు. ఏదో బండి మీడియాలో కనిపించాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
Huzurabad bypoll
అయితే ఇక్కడ కవిత లాజిక్ బాగానే చెప్పారుగానీ…హుజూరాబాద్‌లో బిజేపి గెలిస్తే కేసిఆర్‌ని రాజీనామా చేయమనడం కరెక్ట్ కాదనే కోణంలో కవిత మాట్లాడారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది…అంటే కవిత లాజిక్ ప్రకారం హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ గెలవదని పరోక్షంగా చెప్పేస్తున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో గెలుపు ఎవరిదనేది కవితకు బాగా క్లారిటీ ఉన్నట్లు ఉంది. ఎంతైనా కవిత చెప్పకనే చెప్పినట్లైందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
trs ministers huzurabad bypoll
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.