Kangana Ranaut : వావ్ ఏం అందం.. సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న కంగనా రనౌత్..
Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.
ఈ భామ నటించిన ‘తలైవి’ చిత్రం ఇటీవల విడుదల కాగా ఇందులో కంగన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్.

kangana ranaut shared her photo in instagram
Kangana Ranaut : స్లీవ్ లెస్ జాకెట్‌తో భారీ ఎద అందాలు చూపుతూ.. సెగలు పుట్టిస్తున్న కంగన..
కంగనా రనౌత్ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకుంది. నేషనల్ అవార్డులూ అందుకున్న కంగన.. సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుందున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టింది కంగన. ‘టైమ్స్ నౌ’ మీడియా చానల్ వారు నిర్వహించబోయే సమ్మిట్‌లో పాల్గొనబోతున్నట్లు పేర్కొంటూ తన ఫొటోను షేర్ చేసింది ఈ భామ.

kangana ranaut shared her photo in instagram
సదరు ఫొటోలో కంగనా రనౌత్ తదేకమైన చూపులతో ఆకట్టుకుంటోంది. సిల్వర్ కలర్ శారీలో ఓ వైపు కుందనపు బొమ్మలా కనిపిస్తూనే.. మరో వైపున స్లీవ్ లెస్ జాకెట్ ధరించి భారీ ఎద అందాలు చూపుతూ మత్తెక్కిస్తోంది. మెడలో తెల్ల పూసల చౌకర్, చెవులకు మ్యాచింగ్ హ్యాంగింగ్స్ ధరించి అందంగా కనబడుతోంది కంగన. ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వావ్.. ఏం అందం, హిందూస్థాన్ కి షేర్ని, బ్యూటిఫుల్, క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.