Rakul Preet Singh Workout Video goes viral
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్ నెస్‌కు ఎంతలా ప్రాధాన్యతను ఇస్తుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు చబ్బీగా ఉండే రకుల్ ఇప్పుడు మాత్రం బక్కపల్చగా తయారైపోయింది. ఒకానొక సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ ను గుర్తు పట్టడం కూడా కష్టమే అయింది. అంతలా తన శరీరాకృతిని మార్చుకుంది. పూర్తిగా జీరో సైజ్‌లోకి మారడంతో కొందరు అభిమానులు పెదవి విరిచారు. చబ్బీగా ఉన్నప్పుడే బాగున్నావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టేవారు. అయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన జిమ్, వ్యాయమాన్ని వదిలిపెట్టేది కాదు.
Rakul Preet Singh Workout Video goes viral
మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఎప్పుడూ కూడా వర్కవుట్లతో బిజీగానేఉంటుది. షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా వర్కవుట్లు చేయడం మాత్రం మానదు. మొన్నామధ్య ఏకంగా రకుల్ వర్కవుట్ చేసుకుంటూనే షూటింగ్ స్పాట్‌కు వెళ్లింది. సైక్లింగ్ చేసుకుంటూ సెట్‌కు వెళ్లాను.. టైం కలిసి వస్తుంది కదా అంటూ చెప్పుకొచ్చింది. రకుల్ ఇప్పుడు కోలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. శివ కార్తికేయన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేస్తుంది. ఇక చివరి షెడ్యూల్ అని త్వరలోనే ఇది కూడా పూర్తి కాబోతోందని చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కష్టపడుతున్న తీరు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కిందకు మీదకు లేస్తూ ఉన్న వర్కవుట్ గురించి చెబుతూ.. జీవితమంటే కూడా ఇలానే ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అయలాన్ అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇంకో రెండు రోజుల్లో ఆ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోందని ప్రకటించింది. ఆ తరువాత మేడే సినిమా షూటింగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొనబోతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రకుల్ అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఫుల్ బిజీగా ఉంటోంది.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.