Samantha Went to Veterinary Hospital
Samantha Ruth Prabhu : అక్కినేని నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి కొందరు హీరోయిన్ సమంతను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకున్నదని, ఎవరితోనే ఎఫైర్ పెట్టుకుందని, ఇలా రకరకాలుగా ట్రోల్ చేస్తుండగా, సమంత వాటిపై స్పందించింది.
Samantha has taken a tuff decision
తాను అవకాశవాదిని కాదని, తన పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని నెటిజన్లపై ఫైర్ అయింది. ఈ క్రమంలోనే తాను నాగచైతన్య నుంచి విడిపోయిందుకు తీసుకున్న నిర్ణయం చాలా బాధతో కూడుకున్నదని తెలిపింది. ఈ సంగతులు పక్కనబెడితే.. సమంత ఇక నార్మల్ అయ్యేందుకుగాను గత జీవిత జ్ఞాపకాలను మరిచిపోయే ప్రయత్నం చేస్తుందట. లైఫ్‌లో మూవ్ ఆన్ కావాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయని, అటువంటి సందర్భంలో గతం తాలుకు అనుభవాలు, సంగతులు మరిచిపోవాలని అనుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత విడాకులు తీసుకున్న రెండు రోజుల తర్వాతనే ఓ యాడ్ షూట్‌లో పాల్గొందని వినికిడి. ఈ క్రమంలోనే సమంత మరో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. వరుస సినిమాలు చేసి తన జీవితంలో జరిగిన ఘటనలను మరిచిపోవాలనుకుంటుందట.
Samantha has taken a tuff decision
అయితే, ఆ మూడు సినిమాలు ఏంటనేది ఇంకా తెలియ రావడం లేదు. కానీ, త్వరలో అనగా నెక్స్ట్ వన్ వీక్‌లోనే ఆ మూడు భారీ చిత్రాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చేస్తాయని తెలుస్తోంది. సమంతకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో సమంత యాక్టింగ్, బోల్డ్ ఫర్ఫార్మెన్స్ చూసి పాన్ ఇండియా వైడ్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలని సమంతకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇకపోతే సమంత ఇప్పటికే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’ పూర్తి చేసింది. గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో సమంత లీడ్ రోల్ ప్లే చేసింది. సమంత ఈ చిత్రం ద్వారా తొలి పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నది. ఇక ఈ సినిమా విడుదల నెక్స్ట్ ఇయర్ ఉంటుందని సమాచారం. కాగా, మూవీ సక్సెస్‌పై మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.