siri who went into depression with trolling
Siri : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఎన్నో కాంట్రవర్సీలను మూట కట్టుకుంది. గతంలో ఎన్టీఆర్, నాని హోస్ట్‌లుగా వ్యవహరించినప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం లేకుండానే కొనసాగింది. కానీ ఈ సారీ హోస్ట్ తో పాటు కంటస్టెంట్స్‌కు సైతం ట్రోలింగ్ ఇబ్బందులు తప్పలేదు. సీజన్ 5కు నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ టైంలో కేవలం ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న కంటస్టెంట్ కు మాత్రమే నాగార్జున సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. హౌస్‌లోని కంటస్టెంట్‌లలో ఒకరైన షణ్ముక్ విజేతగా నిలుస్తాడని అందరూ భావించారు.
కానీ చివరి నిమిషంలో సన్నీ విన్నర్‌గా నిలివడంతో.. షణ్ముక్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.బిగ్‌బాస్ సీజన్ 5లో సిరి, షణ్ముక్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హౌస్‌లో హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయారు. షణ్ముక్ ఎలాగైన విజయం సాధించాలనే ఉద్దేశంతో అతడి లవర్ దీప్తి సునయన చాలానే కష్టపడింది. కానీ సిరి, షణ్ముక్ హౌస్ లో చేస్తున్న పనులకు ఆడియన్స్ సైతం కాస్త అసహనానికి గురయ్యారనే చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా ముద్దులు, కిస్సులతో వీరిద్దరు రెచ్చిపోవడంతో వారిపై ఆడియన్స్‌కు నెగెటివ్ ఫీలింగ్ కలిగింది. ఫనల్‌గా సన్నీ విన్నర్‌గా నిలిచాడు.
siri who went into depression with trolling
తర్వాత బయటకు వచ్చాక షణ్ముక్ తో బ్రేకప్ అవుతున్నట్టు అతడి లవర్ దీప్తి సునయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సిరి లవర్ శ్రీహాన్ సైతం కాస్త దూరం దూరంగానే ఉంటున్నట్టు టాక్. ఇటీవలే ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సిరి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. షణ్ముక్, దీప్తి విడిపోవడానికి నేనే కారణమంటూ చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. ఆ టైంలో నేను డిప్రెషన్‌కు వెళ్లిపోయా.. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. దీప్తితోనూ కలిసి పనిచేశా. వారిద్దరి లవ్ అంత వీక్ కాదు. నా వల్ల వారిద్దరు బ్రేకప్ అయ్యారని నేను అనుకోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది సిరి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.