viral video Kerala saved lives in a single moment
కొన్ని కొన్ని సంఘటనలు కేవలం క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. మనం స్పందించేలోపే ఊహించలేని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు ఎన్నో చూస్తున్నాం. కొన్ని కొన్ని వీడియోలు చూస్తే , నిజంగానే ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలను చూస్తే నోట మాట కూడా ఆగిపోవటం ఖాయం.
అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కేరళ లోని వడకర శాఖకు చెందిన ఒక బ్యాంకు మొదటి అంతస్తులో ఉంటుంది. అక్కడి బయట కారిడార్ లో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అందులో ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి ఉన్నట్లు ఉంది, ఒక్కసారిగా సృహతప్పి గోడపై వెనక్కి వాలిపోయాడు. దాదాపుగా అతను కింద పడిపోయాడు అనే అనుకోవచ్చు, ఆ సమయంలో పక్కనే ఉన్న వ్యక్తి, పడిపోతున్న వ్యక్తి కాలును బలంగా పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేశాడు .
viral video Kerala saved lives in a single moment
దీనితో పక్కనే ఉన్న మరికొందరు వచ్చి పడిపోతున్న వ్యక్తిని పైకి లాగారు. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి జారిపోయి ఇలా భవనంపై నుంచి క్యూలో నిలబడి సృహ తప్పి పడిపోయాడని తెలిసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఎర్ర చొక్కాలో ఉన్న వ్యక్తిని బిను అలియాస్ బాబుగా గుర్తించారు.రక్షించింది థాయిల్ మిట్టల్ బాబూరాజ్ అనే 45 ఏళ్ల వ్యక్తిని నెటిజన్లు ప్రశంసించారు. బాబురాజ్ ఒక వ్యక్తిని ఘోర ప్రమాదం నుండి రక్షించాడని అందరూ ప్రశంసించారు. ఇద్దరూ వడకరలోని కేరళ బ్యాంక్ శాఖకు వచ్చారని.. తమ సొమ్ము డిపాజిట్ చేయడానికి క్యూలో వేచి ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.